రసమయి బాలకిషన్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కాగా, నిరసన తెలిపిన ఇద్దరు యువకులను పోలీసులు చితకబాదారు. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బుధవారంనాడు కూడా సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంట మండలం ముస్కానిపేటలో కూడా రసమయిని అడ్డుకున్న విషయం తెలిసిందే. 

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తాజా మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో జరిగే దసరా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను గురువారంనాడు స్థానికులు అడ్డుకున్నారు. 

రసమయి బాలకిషన్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కాగా, నిరసన తెలిపిన ఇద్దరు యువకులను పోలీసులు చితకబాదారు. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బుధవారంనాడు కూడా సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంట మండలం ముస్కానిపేటలో కూడా రసమయిని అడ్డుకున్న విషయం తెలిసిందే. 

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తుండగా రసమయి గో బ్యాక్ అంటూ గ్రామస్తుల నినాదాలు చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ రసమయిను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్త

రసమయికి చేదు అనుభవం