న్యూఢిల్లీ: మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ గురువారం నాడు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. 

న్యూఢిల్లీ: మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ గురువారం నాడు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.

ఇటీవలనే రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ నాయకత్వంపై రాపోలు ఆనంద్ భాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర నాయకత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఇటీవలనే రాజీనామా చేసిన డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ లు కూడ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

బీజేపీలోకి రాపోలు ఆనంద్ భాస్కర్