కాంగ్రెస్ పార్టీకి ఇటీవలనే రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ బీజేపీలో చేరనున్నారు. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఇటీవలనే రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ బీజేపీలో చేరనున్నారు.

ఈ ఏడాది గత నెల 22వ తేదీన రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరుపై కొంత కాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తనను నిర్లక్ష్యం చేసిందని రాజీనామా చేసిన సందర్భంగా ఆయన విమర్శలు చేశారు. రాపోల్ ఆనంద్ భాస్కర్ బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో రాపోలు ఆనంద్ భాస్కర్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్‌లోకి ఆనంద్ భాస్కర్