దారుణం : బాలికపై అత్యాచారం, కరోనా సోకడంతో.. తండాలోంచి వెలివేసి..
కరోనా ఎన్ని దారుణాలో చేయిస్తోంది. మరెన్నో విషాద ఘటనలతో మనసును మెలి పెడుతోంది. అలాంటి ఓ హృదయవిదారకమైన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. కామాంధుల చేతిలో అత్యాచారానికి గురై, వసతి గృహంలో ఉన్న ఓ బాలికకు కరోనా సోకింది. కనికరం చూపించాల్సిన తండా వాసులు వారిని వెలేయడంతో.. తండాకు దూరంగా గుడారం వేసుకుని కారు చీకట్లో, వర్షంలో, అడవి జంతువుల భయంతో, బిక్కుబిక్కు మంటూ రెండు రోజులు గడిపిన ఉదంతం ఇది.

వివరాల్లోకి వెడితే...సిరిసిల్లా జిల్లా, వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాకు చెందిన ఓ బాలిక గత గత నెల18న లైంగికదాడికి గురైంది. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా, వారు నిందితులను అదే నెల 20న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
బాలికకు వైద్య పరీక్షల అనంతరం సిరిసిల్లలోని సఖి కేంద్రంలో బాలికకు వసతి కల్పించారు. అక్కడ ఆమె అనారోగ్యానికి గురికావడంతో మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అదే రోజు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
బైక్ ను వెంబడించి దాడి చేసి మహిళను వివస్త్రను చేసి కొట్టారు...
అప్పటికే తల్లికి కూడా కరోనా సోకింది. ఐసోలేషన్ కేంద్రంలో పట్టించుకునేవారు లేక పోవడంతో తల్లీకూతుళ్లు తండా కు చేరుకున్నారు. అయితే, అప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపకపోగా తమకు కరోనా వస్తుందనే కారణంతో తండావాసులు వారిని వెలి వేశారు. దీంతో ఊరికి దూరంగా వారి సొంత పొలం వద్ద గుడారం ఏర్పాటు చేసుకున్నారు.
బుధవారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఈ విషయం మీడియాలో ప్రచారం కావడంతో స్పందించిన జిల్లా అధికారులు వెంటనే చేరుకుని తల్లీకూతుళ్లను మళ్లీ సిరిసిల్లలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు