అన్నలా అండగా ఉంటానని నమ్మించి అత్యాచారం : నిద్రమాత్రలు మింగి యువతి ఆత్మహత్యాయత్నం

rape survivor commits suicide in Hyderabad
Highlights

హైదరాబాద్ లో మహారాష్ట్ర యువతిపై దారుణం

భర్తతో దూరంగా ఒంటరిగా ఉంటున్న యువతిపై అతడి కన్ను పడింది. ఆమెకు  మాయమాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు తీసుకువచ్చాడు. నువ్వు నా సోదరిలాంటి దానివని చెప్పి ఒకే రూం లో కలిసి ఉండటానికి ఒప్పించాడు. ఆపై ఆమె బలహీపతను అదునుగా చేసుకుని నిద్రలో ఉండగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన రోహిత్ ఠాగూర్ కు కంప్యూటర్ కోర్స్ నేర్చుకునే సమయంలో ఓ యువతి పరిచయమైంది. అయితే ఆమె భర్త  దూరంగా ఒంటరిగా ఉంటోంది. దీన్ని అదునుగా చేసుకున్న రోహిత్ ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకున్నాడు. అందుకు ఓ పథకం వేశాడు.

యువతికి హైదరాబాద్ లో కంప్యూటర్ కోర్సు  నేర్పిస్తానని, ఆ తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని ఈ కామాంధుడు నమ్మించాడు. నిజమే అనుకుని ఆమె అతడితో కలిసి హైదరాబాద్ కు వచ్చింది. ఇద్దరు కలిసి బేగంపేటలో ఓ రూం ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

అయితే సదరు యువతికి మూర్చ వ్యాధి ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంటుంది. దీన్ని గమనించిన రోహిత్ రాత్రి ఆమె నిద్రమాత్రలు వేసుకుని ఘాడ నిద్రలో ఉండగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే ఈ విషయం పొద్దున బాధితురాలికి తెలియడంతో తీవ్ర మనోవేధనకు గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే వీరు అద్దెకుంటున్న ఇంటి యజమాని దీన్ని గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించాడు. యువతి కాస్త కోలుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రోహిత్‌ ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
 

loader