హనుమకొండలో ఓ డిగ్రీ విద్యార్థినిపై దారుణం జరిగింది.  కళాశాలలో తనతోపాటు చదువుకుంటున్న స్నేహితులే కదా అని నమ్మి పర్యటనకు వెళ్తే.. ఓ స్నేహితుడు ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు.  

సమాజంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. వారి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకవచ్చిన వారిపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయ్ తప్ప ఎక్కడా తగ్గడం లేదు. నిత్యం మహిళలు లైంగిక వేధింపులకు ఎదుర్కొంటూనే ఉన్నారు. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మ కూడదో కూడా తెలియని దీనస్థితిలో మహిళలున్నారు.

తెలిసిన వారే కదా..గుడ్డిగా నమ్మితే చివరికి దారుణానికి పాల్పడిన సందర్బాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. స్నేహితులే కాదా అని నమ్మి పర్యటనకు వెళ్తే.. ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హనుమకొండలోని కేయూ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన ప్రకారం.. వరంగల్‌కు చెందిన విద్యార్థిని, ములుగు జిల్లాలోని ఏటూరునాగారానికి చెందిన విద్యార్థి మరో ఐదుగురు స్నేహితులు కలిసి నాలుగు బైక్‌లపై ఆదివారం ములుగు జిల్లా వాజేడుకు సందర్శన కు వెళ్లారు. అక్కడ కాసేపు తిరుగుతూ.. సరదాగా గడిపారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రింగ్‌ రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లి వరకు చేరుకుని కాసేపు అక్కడ ఆగారు.

ఈ క్రమంలో ఏటూరునాగారానికి చెందిన అన్వేశ్‌ అనే యువకుడు వరంగల్‌కు చెందిన విద్యార్థినితో మాట్లాడాలని చెప్పి తనని రింగ్‌ రోడ్డుకు కాస్త దూరంగా తీసుకెళ్లాడు. నిర్మాణుష్య ప్రాంతం కావడంతో ఆ యువతిపై దారుణానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ యువతిని అక్కడే వదిలి పారిపోయాడు.

మిగతా స్నేహితులందరూ కలిసి బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు సోమవారం కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు