Asianet News TeluguAsianet News Telugu

సైదాబాద్ హత్యాచారం మరువకముందే... హైదరాబాద్ లో మరో చిన్నారిపై అత్యాచారయత్నం

ఓవైపు సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య దుర్ఘటనపై ఆందోళనలు కొనసాగుతుండగానే మరోవైపు చిన్నారులపై అఘాాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాాబాద్ మరో తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 

rape attempt on nine years old child in hyderabad
Author
Hyderabad, First Published Sep 16, 2021, 9:39 AM IST

హైదరాబాద్: సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాదు అతి కిరాతకంగా హతమార్చిన దుర్ఘటనపై తీవ్ర ఆందోళనలు వెళ్లువెత్తుతున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ రాజధాని హైదరాబాద్ మరో చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. అయితే స్థానికులు అప్రమత్తమై కామాంధుడి నుండి చిన్నారిని సురక్షితంగా కాపాడారు. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబీబ్‌నగర్‌ మంగారు బస్తీలో ఓ తొమ్మిదేళ్ల చిన్నారి కుటుంబంతో కలిసి వుంటోంది. అయితే ఆ చిన్నారిపై అదే కాలనీకి చెందిన సుమిత్ అనే యువకుడు కన్నేశాడు. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పి ఖాళీగా వున్న ఓ షాప్ లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. 

అయితే బాలికను తీసుకువెళ్లడాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో యువకున్ని పట్టుకుని ప్రశ్నించారు. దీంతో బాలికను అక్కడే వదిలిపెట్టి సుమిత్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ స్థానికులు అతడికి వెంబడించి పట్టుకున్ని పోలీసులకు అప్పగించారు. 

read more  సైదాబాద్ మైనర్ బాలిక ఫ్యామిలీకి రూ. 20 లక్షల చెక్: నిరాకరించిన బాధితులు, మంత్రుల ముందు నిరసన

ఇదిలావుంటే ఇప్పటికే సైదాబాద్ చిన్నారి హత్యాచారం ఘటన తర్వాత హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజలు కూడా బాధిత కుటుంబానికి అండగా నిలిచి నిందితున్ని వెంటనే పట్టుకుని శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చిన్నారి హత్యాచారానికి నిరసనగా క్యాండిల్ ర్యాలీలు, ఆందోళనలు కొనసాగుతున్నారు. 

చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిని నిందితుడు రాజు కోసం పోలీసులు హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల ఎస్పీలతో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పోలీస్ స్టేషన్‌లలోని అధికారులు అప్రమత్తంగా వుండాలని డీజీపీ ఆదేశించారు. నిందితుడు రాజు ఫోటోలతో స్థానికంగా గాలింపు చర్యలు చేపట్టాలని మహేందర్ రెడ్డి సూచించారు. చిన్న సమాచారాన్ని కూడా వదిలిపెట్టకుండా వెరిఫై చేయాలని ఆయన ఆదేశించారు. మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్ల వద్ద నిరంతరం నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. 

కాగా, సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నానాటికీ జఠిలమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీజీపీ, హైదరాబాద్ సీపీలతో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సమావేశమయ్యారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఘటన విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా వున్నారని ఆయన తెలిపారు.

 నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులును ఆదేశించారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో కేసును విచారణ చేయాలని మహమూద్ అలీ ఆదేశించారు. చిన్నారిపై హత్యాచార ఘటన విషయంలో కేసీఆర్ బాధపడ్డారని.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారని హోంమంత్రి తెలిపారు. 

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా వుంచుతామని ఆయన స్పష్టం చేశారు. రాజు గురించిన వివరాలు తెలిస్తే.. 949061366, 9490616627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios