Asianet News TeluguAsianet News Telugu

సైదాబాద్ మైనర్ బాలిక ఫ్యామిలీకి రూ. 20 లక్షల చెక్: నిరాకరించిన బాధితులు, మంత్రుల ముందు నిరసన


హైద్రాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలోని ఆరేళ్ల మైనర్ బాలిక రేప్ చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ లు ప్రకటించారు. ఇవాళ ఉదయం బాధిత కుటుంబాన్ని వారు పరామర్శించారు. మంత్రులు ఇచ్చే పరిహారం రూ. 20 లక్షలు తీసుకొనేందుకు నిరాకరించారు.

Saidabad minor girl rape murder case:Telangana ministers mahmood ali and satyavathi rathod visited victim family
Author
Hyderabad, First Published Sep 16, 2021, 9:30 AM IST

హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో రేప్, హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ లు గురువారం నాడు ఉదయం పరామర్శించారు. ఇవాళ ఉదయం మంత్రులు మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్ లు ఇవాళ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించారు మంత్రులు.మంత్రుల ముందు చిన్నారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు మంత్రుల ముందు నిరసన వ్యక్తం చేశారు.

also read:సైదాబాద్ రేప్, హత్య కేసు: తాగి అత్తపైనా రాజు దాడి, కూతురిని చంపే యత్నం

ఈ ఘటన జరిగిన  వారం రోజులు దాటినా  తర్వాత పరామర్శకు వచ్చిన మంత్రులను మృతుల కుటుంబసభ్యులు  తమ నిరసననను వ్యక్తం చేశారు. నిందితుడు రాజును ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం రూ. 20 లక్షలు కూడ తమకు వద్దని  బాలిక పేరేంట్స్ తేల్చి చెప్పారు.

నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అన్ని విషయాలను తాము  చెప్పలేమని మంత్రులు బాధిత కుటుంబానికి చెప్పారు. తమ కూతురిని ఏ రకంగా హత్య చేశారో  నిందితుడిని కూడ అదే రకంగా కఠినంగా శిక్షించాలని  బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.

ప్రభుత్వం  తరపున రూ. 20 లక్షల పరిహరానికి చెందిన చెక్ ను బాధిత కుటుంబ సభ్యులు తీసుకొనేందుకు నిరాకరించారు. మంత్రులతో బాధిత కుటుంబంతో పాటు బంధువులు వాగ్వాదానికి  దిగారు. బాధిత కుటుంబం చేతిలో మంత్రులు చెక్ పెట్టి  వెళ్లిపోయారని బాధిత కుటుంబసభ్యులు చెప్పారు. 

మంత్రులు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చే విషయాన్ని బాధిత కుటుంబానికి చెప్పలేదు. భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసిన తర్వాత  మంత్రులు అక్కడికి వచ్చారు. అయితే మంత్రులు ఇక్కడికి వచ్చే విషయాన్ని తెలుసుకొన్న స్థానికులు మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios