మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఓ ప్రముఖ సింగర్ ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ ఆండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. అయితే తాగిన మైకంలో సదరు సింగర్ పోలీసులకు ముప్పుతిప్పటు పెట్టిన సంఘటన నిన్న అర్థరాత్రి జూబ్లీహిల్స్ పరిధిలో చోటుచేసుకుంది.

జూబ్లీహిల్స్ పోలీసులు చేపట్టిన డ్రంక్ ఆండ్ డ్రైవ్ తనిఖీల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు ఆర్టిస్ట్ లోబో పట్టుబడ్డారు. అయితే వీరు తాగిన మైకంలో పోలీసులకు సహకరించకుండా ముప్పుతిప్పలు పెట్టారు. లైసెన్సు, ధార్ కార్డు లేదంటూ ట్రాఫిక్ సిబ్బందిని అరగంట పాటు ఇబ్బందిపెట్టారు. అంతే కాకుండా తాము ఆర్టిస్టులమని, తమను ఇలా రోడ్డుపై నిలబెట్టి ప్రశ్నించడం ఏంటని వాగ్వివాదానికి దిగారు. 

అయితే రాహుల్ దగ్గర అసలు లైసెన్సు లేకుండానే కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడి కారును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రాహుల్, లోబోలు వేరే ప్రైవేట్ వాహనంలో అక్కడినుండి వెళ్లిపోయారు. 

వీడియో

"

 

"