అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా అదనపు జడ్జి వి. వరప్రసాద్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి వరకు ఎల్‌బి నగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సుమారు రూ.3 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు

అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా అదనపు జడ్జి వి. వరప్రసాద్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి వరకు ఎల్‌బి నగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సుమారు రూ.3 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు..

అనంతరం ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై కేసు నమోదు చేసి.... తెల్లవారుజామున 4 గంటలకు మెజిస్ట్రేట్ ముందు వరప్రసాద్‌ను హాజరుపరిచారు. న్యాయమూర్తి వరప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్‌ను విధించారు. అనంతరం పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.