నౌహీరా షేక్‌ను  సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి  జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: నౌహీరా షేక్‌ను సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే నెల 12 వ తేదీ వరకు నౌహీరా జ్యూడీషీయల్ రిమాండ్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే వారం రోజుల పాటు నౌహీరా షేక్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.