ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మనవరాలు, దివంగత సుమన్, విజయేశ్వరి దంపతుల కుమార్తె కీర్తి సోహన వివాహం.. వినయ్‌తో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, సుప్రీంకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌, సూపర్‌స్టార్ కృష్ణ దంపతులు, చిరంజీవి దంపతులతో పాటు పలువురు సీని, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. 

"