75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం నాడు హైద్రాబాద్ లోని గూగీ ప్రాపర్టీస్ ఉద్యోగులు కొత్తపేట నుండి ఎల్బీ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ పతాకంతో ఈ ర్యాలీని నిర్వహించారు ఈ సంస్థ ప్రతినిధులు.
హైదరాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ గూగీ ప్రాపర్టీస్ ఉద్యోగులు కొత్తపేట నుండి ఎల్బీ నగర్ వరకు 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

గూగీ ప్రోపర్టీస్ ఎం.డీ, సీఈఓ షేక్ అక్బర్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో భారత జెండాను ఎగురవేశారు. కొత్తపేట నుండి ఎల్.బి.నగర్ వరకు 75 మీటర్ల త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు..

ఈ ర్యాలీలో 250 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు.
