ప్రతి ఏడాది రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది కేరళ వరదల నేపథ్యంలో రాఖీ వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు.
రాఖీ పండగ వచ్చిందంటే చాలు.. రాజ్ భవన్ లో సంబరాలు మొదలైపోతాయి. స్కూల్ పిల్లలు సహా.. అందరూ.. అక్కడికి వెళ్లి గవర్నర్ కి రాఖీ కడుతూ ఉంటారు. కానీ.. ఈ ఏడాది ఆ సందడి ఉండటం లేదు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
కేరళ వరదల నేపథ్యంలో రాఖీ వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలు తమకు తోచినంతగా.. కేరళ రాష్ర్టానికి సాయం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది కేరళ వరదల నేపథ్యంలో రాఖీ వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు.
