హైదరాబాద్: హైద్రాబాద్‌పర్వతాపూర్‌లో రియల్ఏస్టేట్ వ్యాపారి రాజిరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి అత్యంత దారుణంగా హత్య చేశారు. మేడిపల్లి సమీపంలోని పర్వతాపూర్ వద్ద కారులోనే కాపు కాసి నరికి చంపారు.

కారులోనే దుండగులు రాజిరెడ్డిని నరికి చంపారు. పర్వతాపూర్ నుండి  ఉప్పల్ వస్తుండగా రాజిరెడ్డిని నరికి చంపారు. మట్టిరోడ్డు కావడంతో కారును రాజిరెడ్డి నెమ్మదిగా నడుపుతున్నాడు.ఇదే అదనుగా భావించిన దుండగులు కారు అద్దాలు ధ్వంసం చేశారు.  దీంతో కారు నుండి దిగి రాజిరెడ్డి పారిపోయే ప్రయత్నం చేశారు.

ఈ సమయంలో రాజిరెడ్డి కళ్లలో కారం కొట్టిన  నిందితులు  అతడిని అక్కడే మారణాయుధాలతో  నరికి చంపారు. వ్యాపార వివాదాలే  ఈ ఘటనకు కారణమనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.రాజిరెడ్డిని హత్య చేసిన వారిని  గుర్తించేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.