రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం:34 మందిపై సస్పెన్షన్ వేటు
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో గల వెటర్నరీ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడిన 34 మంది విద్యార్ధులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది.
హైదరాబాద్:రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో గల వెటర్నరీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. ర్యాగింగ్ కు గురైన విద్యార్ధులు రాత పూర్వకంగా ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 34 మంది విద్యార్థులపై వీసీ చర్యలు తీసుకున్నారు.
రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్శిటీలో సీనియర్లు జూనియర్ విద్యార్ధులపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు.ఈ విషయమై జూనియర్ విద్యార్ధులు ఈ విషయమై లేఖ రాసి ఫిర్యాదుల బాక్సులో వేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా సీనియర్ విద్యార్ధులు 34 మందిని రెండు వారాల పాటు సస్పెండ్ చేశారు. గతంలో ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపాల్ తో ఇతర ప్రొఫెసర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఫిర్యాదుల బాక్సులో విద్యార్ధులు తమ ఫిర్యాదులను వేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన వీసీ ర్యాగింగ్ కు పాల్పడిన 34 మంది సీనియర్లపై చర్యలు తీసుకుంది.