టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌: నేరేళ్లచెరువులో రాజేంద్ర కుమార్ అరెస్ట్


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీక్  కేసులో నేరేళ్లచెరువకు  చెందిన  రాజేంద్రకుమార్ ను సిట్  అధికారులు  అరెస్ట్  చేశారు.  

 Rajendra kumar arrested in TSPSC  Question  Paper Leak lns

హైదరాబాద్: ఉమ్మడి   మహబూబ్ నగర్ జిల్లాలోని  షాద్ నగర్ మండలం  నేరేళ్ల  చెరువుకు  చెందిన రాజేంద్ర కుమార్ ను సిట్  అధికారులు  ఆదివారం నాడు అరెస్ట్  చేశారు. ప్రశ్నాపత్రం  కొనుగోలుకు  రూ. 10 లక్షలకు ఒప్పందం కుదిరిందని  సిట్  అధికారులు  గుర్తించారు.   రూ. 5 లక్షలు అడ్వాన్స్ గా  రాజేంద్రకుమార్  ఇచ్చారన్నారు.  తిరుపతయ్య అనే వ్యక్తి నుండి  రాజేంద్రకుమార్ కొనుగోలు  చేశారని సిట్  గుర్తించింది.    ఉపాధి హామీ పథకంలో  తిరుపతయ్యతో  పాటు  రాజేంద్రకుమార్ కిలిసి పనిచేసినట్టుగా  సిట్ అధికారులు గుర్తించారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో  ప్రశ్నాపత్రం లీక్  అంశం  రాష్ట్రంలో  కలకలం రేపుతుంది.  ఇప్పటికే  నాలుగు  పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ రద్దు  చేసింది. మరో రెండు పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది.  

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో  ఇప్పటికే  12 మందిని సిట్  అరెస్ట్  చేసింది. ఇవాళ  మరొకరిని  అరెస్ట్  చేశారు.  ఈ కేసులో  అరెస్టైన  నిందితుల్లో  నలుగురిని  సిట్ బృందం  కస్టడీలోకి తీసుకుని  ప్రశ్నిస్తుంది.  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశానికి  సంబంధించి  సిట్ బృందం  విచారణ  చేస్తుంది. పేపర్ లీక్ అంశానికి  సంబంధించి  కాంగ్రెస్, బీజేపీ నేతలు  ఆరోపణలు  చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios