Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బీజేపీలో మార్పు కోసం ఆలే శ్యామ్‌‌జీని పార్టీలోకి తీసుకోవాలి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో మార్పు రావాలంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఆలే శ్యామ్ జీని పార్టీలో తీసుకోవాలన్నారు.

Rajasingh asks to bring RSS ale shyam to telangana BJP ksm
Author
First Published Oct 19, 2023, 2:55 PM IST

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో మార్పు రావాలంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఆలే శ్యామ్ జీని పార్టీలో తీసుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి అందరం కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే అభివృద్ది జరుగుతుందని ప్రజల్లో చర్చ జరుగుతుందని అన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని.. తెలంగాణలో బీజేపీకి ఒక శక్తి అవసరమని పేర్కొన్నారు. ప్రధాని మోదీలో ఉన్న మంచితనం ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చిందని అన్నారు. 

తెలంగాణ బీజేపీలోకి ఈ సమయంలో ఆర్ఎస్ఎస్‌లో ఉన్న ఒక మంచి వ్యక్తి వస్తే  బాగుంటుందని అన్నారు. ఒకప్పుడు టైగర్ నరేంద్ర(ఆలే నరేంద్ర) అంటే.. ఎంఐఎం గానీ, అప్పుడున్న ప్రభుత్వాలు గానీ భయపడేవని అన్నారు. ఆర్ఎస్ఎస్‌లో ఉన్న టైగర్ నరేంద్ర సోదరుడు ఆలే శ్యామ్ జీ‌ని బీజేపీలోకి పంపిస్తే తెలంగాణ పార్టీ మరింత బలంగా మారుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. దీనిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆలోచన చేయాలని కోరారు. 

ఆలే శ్యామ్ జీ రాకతో తెలంగాణ బీజేపీలో మార్పు తథ్యమన్నారు. శ్యామ్ జీని పార్టీలోకి తీసుకురావటానికి కిషన్ రెడ్డి సహా రాష్ట్ర నేతలు కృషి చేయాలన్నారు. జాతీయ నాయకత్వంతో మాట్లాడాలని కోరారు. ఇక, వివాదస్పద వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్ ప్రస్తుతం బీజేపీలో సస్పెన్షన్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios