Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ నాకు సారీ చెప్పిండు

  • అగ్రవర్ణ మంత్రులపై అభియోగాలొచ్చినా చర్యలు లేవు 
  • నా దురదృష్టమో.. అదృష్టమో నామీద ర్యలు తీసుకున్నారు
  • నన్ను పిలిపించుకుని ‘ఎక్సట్రీమ్లీ సారీ‘ అని చెప్పారు
Rajaiah claims cm kcr tendered apologies to him

తెలంగాణ తొలి మాజీ డిప్యూటీ సిఎంగా నియమితులైన తాటికొండ రాజయ్య అనతికాలంలోనే తన పదవిని కోల్పోయారు. సిఎం కేసిఆర్ రాజయ్యను బర్తరఫ్ చేసి షాక్ ఇచ్చారు. అయితే రాజయ్యను ఎందుకు మంత్రివర్గం నుంచి తొలగించారన్నది ఇప్పటికీ సస్పెన్ష్ గానే మిగిలిపోయింది. కొందరు అవినీతికి పాల్పడ్డందుకే వేటు పడిందని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు తన పనితీరు బాగాలేని కారణంగా వేటు పడిందంటున్నారు. ఇంకొందరైతే నైతిక విలువలు పాటించలేదు కాబట్టే వేటు పడిందని చెప్పుకుంటున్నారు. కానీ రాజయ్యను తొలగించిన సిఎం మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తనపై వేటు విషయమై తాటికొండ రాజయ్య చాలా కాలం తర్వాత పెదవి విప్పారు. ఇటీవల ఒక తెలుగు టివి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలకమైన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారో చదవండి.

నన్ను మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించారో నాకు ఇప్పటికీ అర్థం కాట్లేదు. ఆరోజే నేను చెప్పాను కడిగిన ముత్యం లా బయటకు వస్తానని. అలాగే వచ్చాను. నన్ను మంత్రివర్గం నుంచి తొలగించడం ఒక విధంగా నాకు మంచిదనే అనుకుంటున్నాను.

తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటివరకు అగ్రకులాల్లోని అందరు మంత్రుల మీద అభియోగాలు వచ్చాయి. కానీ ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు. నా దురదృష్టమో.. అదృష్టమో నామీద చర్యలు తీసుకున్నారు. నా నియోజకవర్గంలో సమయం వెచ్చించడానికి అవకాశం కల్పించారని అనుకున్నా. అందుకే నేడు నాలుగో స్థానంలో నేను నిలిచాను. ఎందుకంటే నేడు కేసిఆర్, కేటిఆర్, హరీష్ రావు తర్వాత నాలుగో స్థానంలో నా నియోజకవర్గంలో నేను ప్రజలకు సేవలు చేసుకుంటున్నాను.

కేసిఆర్ అనుకున్నారు కాబట్టి మంత్రివర్గంలోకి నన్ను తీసుకున్నారు. వద్దనుకున్నారు కాబట్టి తొలగించారు. తొలగించిన తర్వాత సిఎం నాకు క్షమాపణ చెప్పారు. రాజయ్యా.. ఐయామ్ సారీ.. ఎక్స్ ట్రీమ్లీ సారీ.. అని నన్ను తన వద్దకు పిలిపించుకుని చెప్పారు. రాజయ్యా .. పత్రికల్లో వచ్చిన కథనాలు.. చిలువలు పలువలు చేసి చాలా మంది నా మైండ్ తినేశారు. ఆరోజు నువ్వు అడగకముందే డిప్యూటీ సిఎం ఇచ్చాను. ఐయామ్ సారీ అని చెప్పారు.

అంతేకాదు.. నీ నియోజకవర్గంలో ఏ పనులు ఉన్నా. డైరెక్ట్ నా దగ్గరికే రా.. నువ్వు ఉపముఖ్యమంత్రిగా పనిచేశావు కాబట్టి వేరేవాళ్ల దగ్గరకు వెళ్లలేవు. అని కూడా చెప్పారు. నీ హోదాకు తగిన గౌరవం కల్పిస్తానని చెప్పారు.. అని మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ డిప్యూటీ సిఎం రాజయ్య వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios