Asianet News TeluguAsianet News Telugu

పీడీ యాక్ట్‌కు వ్యతిరేకంగా హైకోర్టు ఆశ్రయించిన రాజా సింగ్ భార్య ఉషా బాయి

హైదరాబాద్: మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ప‌లు చోట్ల కేసులు న‌మోద‌య్యాయి. అయితే, హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న త‌ర్వాత వెంట‌నే బెయిల్ పై విడుద‌ల కావ‌డంతో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. ఈ క్ర‌మంలోనే మరిన్ని కేసులను ప్రస్తావిస్తూ.. శాంతికి భంగం క‌లిగించే విధంగా రాజాసింగ్ న‌డుచుకుంటున్నార‌ని పేర్కొంటూ పోలీసులు ఆయ‌న‌పై పీడియాక్ట్ ను ప్రయోగించారు. 

Raja Singh's wife Usha Bai approached the Telangana High Court against the PD Act
Author
First Published Sep 6, 2022, 10:46 AM IST

తెలంగాణ‌: గోషామహల్ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే రాజా సింగ్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ యాక్ట్) చట్టం కింద చెర్ల‌ప‌ల్లి జైలులో ఉంచడం చట్టవిరుద్ధం-రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ..  ఆయన భార్య ఉషాబాయి సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును మంగళవారం కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ జారీ చేసిన డిటెన్షన్ ఆర్డర్‌లో అనేక లోపాలున్నాయని పేర్కొంటూ, ఎమ్మెల్యే భార్య తన భర్త ప్రమేయం ఉన్న కేసులు-వాటి వివరాలను డిటైనింగ్ అథారిటీ వివరించలేదని పేర్కొంది. "రాజాసింగ్ యాంత్రిక పద్ధతిలో అనేక కేసుల్లో ప్రమేయం ఉన్నాడని చెప్పడం తప్ప, ఆగస్ట్ 25 డిటెన్షన్ ఆర్డర్‌లో ప్రివెంటివ్ డిటెన్షన్ అవసరమని ఆరోపించిన కేసుల వివరాలు లేవు" అని ఆమె పేర్కొన్నారు. పిటిషనర్ ప్రివెంటివ్ డిటెన్ష‌న్ ఒక అనంతర ఆలోచనగా అభివర్ణించారు. చట్టపరమైన లోపాల కారణంగా మేజిస్ట్రేట్ రిమాండ్ నివేదికను ఆమోదించడానికి నిరాకరించినందున ఎమ్మెల్యేను మొదట్లో అరెస్టు చేసినప్పుడు పోలీసులు అతన్ని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.

"సాధారణ ఐపీసీ నిబంధనల ద్వారా పరిష్కరించగల చిన్న సమస్యలకు తెలంగాణ రాష్ట్రం ప్రివెంటివ్ డిటెన్షన్ అధికారాలను ఉప‌యోగించుకుని దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న‌ద‌ని" రాజాసింగ్ భార్య త‌న పిటిష‌న్ లో పేర్కొంది. "సాధారణ ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ (ఐపీసీ) నిబంధనల ద్వారా పరిష్కరించగల చిన్న సమస్యల కోసం తెలంగాణ రాష్ట్రం నివారణ నిర్బంధ అధికారాలను దుర్వినియోగం చేస్తోంది" అని సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో తెలంగాణ పోలీసు అధికారులను తప్పు పట్టిన సందర్భాలను ఉటంకిస్తూ ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  డిటెన్షన్ అథారిటీ గానీ, అప్రూవింగ్ అథారిటీ గానీ పీడీ ఆర్డర్‌లో నిర్బంధ కాలాన్ని పేర్కొనలేదని, ఇది పీడీ చట్టంలోని నిబంధనలను కూడా ఉల్లంఘించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు. "అవసరమైన పత్రాలు శాసనసభ్యుడికి అర్థమయ్యే భాషలో అందించబడలేదు. మేము ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే అధికారులు హిందీలో కాపీలను సక్రమంగా అందించడం ద్వారా తమ తప్పును సరిదిద్దుకున్నారని పేర్కొంటూ.. నిర్బంధ ఉత్తర్వులను రద్దు చేసి త‌న భ‌ర్త‌ను జైలు నుంచి విడుద‌ల చేయాలని" ఆమె హైకోర్టును కోరారు. 

కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఇదివ‌ర‌కు అనేక సార్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, శాంతికి భంగం క‌లిగించే విధంగా ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశార‌ని కేసులు న‌మోద‌య్యాయి. ఇటీవ‌ల యూట్యూబ్ ఛాన‌ల్ లో విడుద‌ల చేసిన ఒక వీడియోలో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ముస్లిం వ‌ర్గాల నుంచి పెద్దఎత్తున వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై ప‌లు కోట్ల కేసులు న‌మోద‌య్యాయి. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్టు చేశారు. అయితే, కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజురు చేయ‌డంతో హైద‌రాబాద్ లోని పాత‌బ‌స్తీలో పెద్దఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బీజేపీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌డొడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతున్న‌ద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల మ‌రో బీజేపీ నాయ‌కులు నుపూర్ శ‌ర్మ వ్యాఖ్య‌లు సైతం గుర్తు చేస్తూ బీజేపీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. దీంతో బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి తాత్కాలికంగా స‌స్పెండ్ చేసింది. ఆ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ‌ను కొరింది. ఇదివ‌ర‌కే రాజాసింగ్ భార్య బీజేపీ కూడా లేఖ రాశారు. వివ‌రణ ఇవ్వ‌డానికి మ‌రింత స‌మ‌యం కోరారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios