వివాదాస్పద వ్యాఖ్యలు:రాజాసింగ్ ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను నాంపల్లి కోర్టులో మంగళవారం నాడు హాజరుపర్చారు.
హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మంగఁళవారం నాడు సాయంత్రం నాంపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. ఇవాళ ఉదయం రాజాసిగ్ ను ఆయన ఇంటి వద్దే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుండి బొల్లారం పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుండి నాంపల్లి కోర్టుకు తరలించారు.
మునావర్ ఫరూఖీ కామెడీ షో ను నిర్వహించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్ లో వీడియోను అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో ఓ వర్గాన్ని కించపర్చేలా ఉన్నాయని ఎంఐఎం నేతలు సోమవారం నాడు ఆందోళన నిర్వహించారు. మంగళవారం నాడు ఉదయం వరకు ఎంఐఎం శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపణలు చేసింది. దీంతో ఈ వీడియోను తొలగించాలని యూట్యూబ్ కు హైద్రాబాద్ పోలీసులు కోరారు..
also read:రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు:శాసనసభ పక్ష నేత పదవి నుండి తొలగింపు
పోలీసుల వినతి మేరకు ఈ వీడియోను యూట్యూబ్ తొలగించింది.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం కూడా రాజాసింగ్ పై చర్యలు తీసుకొంది. పార్టీ నియామావళికి వ్యతిరేకంగా వ్యవహరించినందున రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ నాయకత్వం,. 10 రోజుల్లో చర్యలు వివరణ ఇవ్వాలని కూడా బీజేపీ నాయకత్వం కోరింది. బీజేపీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు బీజేపీ శాసనసభపక్ష నేత పదవి నుండి కూడా తప్పించింది పార్టీ.పలు పోలీస్ స్టేషన్లలో కూడా రాజాసింగ్ పై పిర్యాదులు అందాయి. డబీర్ పురా , మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లలో కూడా రాజాసింగ్ పై కేసులు నమోదయ్యాయి.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు రేపేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడే ప్రయత్నం చేస్తుంది. అయితే మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని బీజేపీపై ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో ఏనాాడు లేని పరిస్థితులను రాస్ట్రంలో సృష్టిస్తున్నారని ప్రత్యర్ధి పార్టీలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి.