ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో వేడి నుంచి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులును ఆదేశించారు. బుధవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. కావున ప్రజలకు వేడి గాలుల వల్ల కలిగే దుష్పరిమాణాలపై అధికారులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వేడి గాలుల నేపథ్యంలో స్కూల్ పిల్లలకు ముందుగానే సెలవు ఇచ్చేయాలని సూచించారు.
అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య, విద్య, విపత్తు నిర్వహణ శాఖల ఉన్నతాధికారులతో బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. స్టూడెంట్లను తొందరగా ఇంటికి పంపించేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.
ఎండలు మండిపోతున్న ఈ తరుణంలో ఆసుపత్రులు, తాగునీటి సరఫరా విద్యుత్ నిర్వహణతో పాటు అన్ని అన్ని క్లిష్టక్లిమైష్టన సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. దీంతో పాటు పరీక్షలకు హాజరయ్యే పిల్లల్ల కు అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు తమ నిర్ధిష్ట హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
మార్కెట్ యార్డులు, బస్ స్టేషన్లు తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. పల్లెటూర్లలో గ్రామ సభలు నిర్వహించి ఈ ఎండాకాలంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు వంటి వాటిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రానున్న రెండురోజుల్లో ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని అన్నారు. సరిపడా ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పర్చాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
