పాలమూరు పేరు వింటేనే.. అదొక కరువు నేల. పాలమూరు పేరు చెబితేనే అదొక వెనుకబడిన జిల్లా. పాలమూరు పేరు తలిస్తేనే.. ప్రపంచానికి వలస కార్మికులను అందించిన జిల్లా.. పాలమూరు పేరు గుర్తుకొస్తే.. గుండెలు బరువెక్కుతయ్.

నిన్నటి వరకు పాలమూరు అన్నదాతకు వచ్చిన కష్టం ఏదంటే.. వర్షాలు కురవక.. అత్తెసరు నీళ్లతో పంటలు పండిచిండు. విత్తనం భూమిలో వేసినప్పటినుంచి వానదేవుడు పాలమూరు బక్కరైతును పగబట్టుడు షురూ చేస్తడు. వాన సుక్క రాలకుండా కసి తీర్చుకుంటడు. అయినా అష్టకష్టాలు పడి పంట పండించిన తర్వాత కూడా వానదేవుడి పగ చల్లారదు. ఎంత పగ పట్టినా.. నువ్వు పంటలు పండిస్తవా అని మల్లా పండిన ధాన్యరాశుల మీద వరదలొచ్చే వాన కురిపించిండు. ప్రకృతి ప్రకోపానికి బలైన పాలమూరు అన్నదాత గుండె పలిగి ఏడుస్తున్నడు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అచ్చంపేట ఏరియాలో శుక్రవారం వరదలొచ్చేలా వాన కురిసింది. ఈ వానకు అచ్చంపేట మార్కెట్ లో అమ్మకానికి తెచ్చిన వేరుశెనగ ధాన్యం వరద పాలైంది. మార్కెటింగ్ శాఖలో అద్భుతాలు సృష్టిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చెబుతూనే ఉన్నది. కానీ అచ్చంపేట మార్కెట్ లో మాత్రం వానొస్తే ధాన్యం దాచుకునే వెసులుబాటు లేక తెచ్చిన ధాన్యం తడిసి ముద్దై పోయింది. వరదలు రావడంతో పల్లీలు వరదలో కొట్టుకు పోయాయి. సరిగ్గా వానలు పడక కొద్దిపాటి నీళ్లతో పంటలు పండిస్తే... తీరా మార్కెట్ కు పల్లీలు తీసుకురాగానే పంటంతా వరదపాలైందని రైతులు లబోదిబోమంటున్నారు. సుమారు 50 మంది రైతులు మార్కెట్ కు బుడ్డలు తెచ్చారు. వారి పంట మొత్తం నేలపాలైంది. వర్షం వచ్చిన తర్వాత మార్కెటింగ్ శాఖ వాళ్లు

ఈ ఏడాదే పల్లీలు వేసిన. ఈ కష్టమొచ్చింది : రైతు మల్లారెడ్డి


నాగర్ కర్నూలు జిల్లాలోని ఉప్పునుంతల మండలం, తిర్మలాపూర్ గ్రామానికి చెందిన జిల్లెల మల్లారెడ్డి మొదటి సారి ఈ సంవత్సరం 2 ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు. ముందు వేసిన పంట చేతకొచ్చింది. దాన్ని మార్కెట్ కు తరలించారు. 18 బస్తాల వేరుశెనగ మార్కెట్ కు తీసుకొస్తే.. మాయదారి వాన రావడంతో పల్లీలు మొత్తం తడిచిపోయాయని ఏషియానెట్ కు తన ఆవేదన తెలిపారు. కొంత ధాన్యం వర్షంలో కొట్టకుపోయిందన్నారు. మబ్బు పట్టింది కవర్లు ఇయ్యమని ఎంత అడిగినా మార్కెటింగ్ సిబ్బంది పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన తర్వాత కవర్లు ఇచ్చారని, అయినా అప్పటికే పంటంతా తడిచి ముద్దైందన్నారు. ధాన్యం నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందించి న్యాయం చేయాలని కోరారు.