రెయిన్ అలర్ట్ : తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలోని దిగువ ట్రోఫోస్పియర్ లో తూర్పు గాలులు వీస్తున్నాయి. దీని కారణంగానే రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

Rain Alert : today and tomorrow Rains in Telangana - bsb

హైదరాబాద్ : తెలంగాణలో నేడు రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురువనున్నాయి. గురు, శుక్రవారాల్లో కూడా హైదరాబాదులోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసాయి. ఇక శనివారం ఆదివారం నాడు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఇచ్చారు.

తెలంగాణలోని దిగువ ట్రోఫోస్పియర్ లో తూర్పు గాలులు వీస్తున్నాయి. దీని కారణంగానే రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారంనాడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. ములుగు జిల్లా మేడారంలో 54 మిల్లీమీటర్లు, సిద్దిపేట జిల్లా సింగారంలో 60, నల్గొండ జిల్లా చందంపేటలో 29, హనుమకొండ జిల్లా దామెరలో 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ఆదివారం నాడు బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ చుట్టూ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ఇది సోమవారం అంటే నవంబర్ 27 నాటికి అల్పపీడనంగా మారుతుందన్నారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ దిశగా ప్రయాణించి 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా వాయుగుండంగా బలపడుతుందని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios