Asianet News TeluguAsianet News Telugu

చల్లని కబురు: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతోన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆదివారం అక్కడక్కడా ఒక మాదిరి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. 

rain alert for telugu states
Author
Hyderabad, First Published Mar 9, 2019, 8:36 AM IST

ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతోన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆదివారం అక్కడక్కడా ఒక మాదిరి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది.

మరోవైపు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతం నుంచి దక్షిణ ఒడిశా తీరం, కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఒక బలహీనమైన ద్రోణి కొనసాగుతోందని వివరించారు. శనివారం తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది.

శుక్రవారం భద్రాచలంలో అత్యధికంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత నిజామాబాద్‌లో 36.9, ఖమ్మం, నల్గొండలో 36.8, హైదరాబాద్‌లో 34.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios