కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సహంగా ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పాదయాత్ర మార్గంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్నవారికి అభివాదం చేస్తూ రాహుల్ ముందుకు కదులుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సహంగా ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పాదయాత్ర మార్గంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్నవారికి అభివాదం చేస్తూ రాహుల్ ముందుకు కదులుతున్నారు. రాహుల్ పాదయాత్రలో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం రాహుల్ యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. ఆదివారం రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం ఉదయం జడ్చర్ల మండలం గొల్లపల్లి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించారు. 

రాహుల్‌ పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌లతో పాటు పలువురు నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే రాహుల్‌తో కొందరు చిన్నారులు కూడా కాలు కదిపారు. ఈ క్రమంలోనే రాహుల్ చిన్నారుల్లో ఉత్సాహం నింపేలా వారితో పోటీ పడుతూ పరుగు తీశారు. అక్కడే ఉన్న రేవంత్ రెడ్డి కూడా రాహుల్ వెంటే పరుగులు తీశారు. చిన్నారులు కూడా పరుగులు తీస్తూ రాహుల్‌ను అందుకోవడానికి ప్రయత్నించారు. 

Scroll to load tweet…

ఇక, ఈ ఆకస్మిక పరిణామంతో.. రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది, పోలీసులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పరుగులు తీశారు. రాహుల్ పరుగులు తీయడంతో అక్కడున్నవారు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల కిందట రాహుల్ గాంధీ కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్య చేతిని పట్టుకుని కొద్ది దూరం పరుగులు తీసిన సంగతి తెలిసిందే.

ఇక, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు 22 కి.మీ పాదయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం షాద్‌నగర్‌లోని సోలిపూర్ జంక్షన్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఇక, నవంబర్ 7వ తేదీ వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది.