Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్ 9న హైద్రాబాద్‌లో రాహుల్ సభ: రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9వ తేదీన హైద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాహుల్ గాంధీ సభను నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు . కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం నాడు గాంధీభవన్ లో ఆయన ప్రారంభించారు.

Rahul Gandhi Meeting On December 9 In Hyderabad says Revanth Reddy
Author
Hyderabad, First Published Nov 1, 2021, 8:09 PM IST

హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో రాహుల్ గాంధీతో  భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీపీసీసీ చీఫ్ Revanth Reddy సోమవారం నాడు గాంధీ భవన్ లో ప్రారంభించారు. 

also read:అలా రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర, ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం: రేవంత్ రెడ్డి సంచలనం

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా Congress పార్టీ Membership చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొన్న ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల ఇన్స్ రెన్స్ సౌకర్యం కల్పిస్తామని  ఆయన హామీ ఇచ్చారు.

ఈ నెల 9, 10 తేదీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా, మండల పార్టీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 14 నుండి 21వ తేదీ వరకు గ్రామాల్లో జన జాగరణ యాత్రలు చేపట్టాలని నిర్ణయం తీసుకొన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యత్వం అంటే ఒక గౌరవమని చెప్పారు  దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి దేశాభావృద్దికి కాంగ్రెస్ పాటుపడిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను కూడ కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని ఆయన గుర్తు చేశారు..

 ఇదిలా ఉంటే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని డిసెంబర్ 9వ తేదీన అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో డిసెంబర్ 9వ తేదీన తెలంగాణలోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా  రాహుల్ గాంధీ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలను సమర్పించారు.దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గింది. 

ఆ తర్వాత తెలంగాణలో ఉద్యమం మరింత తీవ్రమైంది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయించడంలో ఆ పార్టీ కీలకంగా వ్యవహిరించింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా కూడా కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలు తెలంగాణలో ఓటమి పాలైంది. వచ్చే ఎన్నికల్లోనైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరో వైపు ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శల దాడిని కూడా పెంచాడు.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లసై ఆ పార్టీ శ్రేణులు ఆసక్తిని కనబరుస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios