జోరందుకున్న ప్రచారం.. రేపటి నుంచి తెలంగాణలో పర్యటించనున్న రాహుల్..బస్సుయాత్ర పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ బస్సుయాత్రలో పాల్గొననున్నారు.

Rahul gandhi bus yatra in telangana schedule full details KRJ

Rahul Gandhi: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా పార్టీ అధినేతలతో ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ.. తమ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీని రంగలోకి దించనున్నది. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నాయి.

వీరు రాష్ట్రంలో మూడు రోజులు పాటు పర్యటించున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించాలని ప్రణాళికలను సిద్దం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ను గద్దెదించి.. ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహారచన చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ప్రచార పర్వంలోకి దింపుతుంది. ఇందులో భాగంగా మూడు దశల్లో బస్సు యాత్ర నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. 

ఫస్ట్ ఫేస్ యాత్ర ములుగు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో దాదాపు 190 కిలోమీటర్ల మేర సాగనుంది. తొలి రోజు మహిళల సభ మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు యాత్రలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఈ. మేరకు తొలుత రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న రాహుల్, ప్రియాంక లు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం బస్సు యాత్ర ప్రారంభం అయ్యాక ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామానుజపురంలో మహిళలతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో వారిద్దరూ ప్రసంగిస్తారు. ఈ సభలోనే ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారు. అనంతరం భూపాలపల్లిలో పాదయాత్ర నిర్వహించి నిరుద్యోగ యువత సమస్యలపై చర్చించనున్నారు. ఈ సందర్బంగా యువతతో ప్రత్యేక భేటీ కానున్నారు. మొదటి రోజు యాత్ర ముగిసిన తర్వాత ప్రియాంక గాంధీ ఢిల్లీకి పయానం కానున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు

ఇక రెండో రోజు పర్యటన రామగుండం నియోజకవర్గంలో సాగనున్నది. ఈ పర్యటనలో భాగంగా  రాహుల్ గాంధీ అక్కడ సింగరేణి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ సిఎల్ కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల సమస్యలపై చర్చించనున్నారు. అనంతరం దాదాపు 30 కిలోమీటర్లు బస్సు యాత్ర నిర్వహించి పెద్దపల్లిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ బహిరంగ సమావేశంలో ప్రధానంగా రైతుల అంశాల ధ్వజమెత్తనున్నారు. ఈ సమావేశం అనంతరం కరీంనగర్ కు చేరుకోనున్నారు. అక్కడ పాదయాత్ర నిర్వహించనున్న రాహుల్ గాంధీ అక్కడ వివిధ వర్గాలతో ప్రత్యేక భేటీ కానున్నారు. 

ఇక మూడో రోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు రాహుల్ గాంధీ. బోధన్ నియోజకవర్గంలో బీడీ కార్మికులు గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలతో మాట్లాడనున్నారు. అనంతరం నిజాంసాగర్ ఫ్యాక్టరీని సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీయనున్నారు. అక్కడ కార్మిక నేతలతో మూచ్చటించనున్నారు. ఈ భేటీ అనంతరం.. 50 కిలోమీటర్ల బస్సు యాత్ర తరువాత ఆర్మూర్ చేరుకోనున్నారు. అక్కడ  నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు.

అక్కడ పసుపు చెరుకు రైతులతో మాట్లాడిన అనంతరం నిజామాబాద్ వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది అక్కడ పాదయాత్రతో రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన ముగుస్తుంది. బస్సు యాత్ర కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు .. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ గాంధీతో హామీ ఇప్పించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios