Asianet News TeluguAsianet News Telugu

సీట్ల సర్ధుబాటుపై చర్చించలేదు, మా మద్దతు కోరారు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

తెలంగాణలో  ప్రజాస్వామ్య పాలన ఏర్పాడేందుకు ఏం చేయాలనే దానిపై  రాహుల్ గాంధీతో చర్చించినట్టుగా  తెలంగాణ జనసమితి చీఫ్  కోదండరామ్ ప్రకటించారు.

Rahul Gandhi  Asks My Party Support Says  TJS Chief  Kodandaram lns
Author
First Published Oct 20, 2023, 10:20 AM IST | Last Updated Oct 20, 2023, 3:48 PM IST

కరీంనగర్:తెలంగాణ ఎన్నికల్లో  తమకు మద్దతివ్వాలని  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ  కోరినట్టుగా  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెప్పారు.శుక్రవారంనాడు కరీంనగర్ లోని హోటల్ లో  రాహుల్ గాంధీతో  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత  కరీంనగర్ లో  కోదండరామ్  మీడియాతో మాట్లాడారు. పొత్తులు, సీట్ల సర్ధుబాటుపై తమ మధ్య చర్చ జరగలేదని కోదండరామ్ చెప్పారు.  తెలంగాణ రాష్ట్రంలో  నిరంకుశ పాలన పోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా కోదండరామ్ చెప్పారు. తెలంగాణలో  ప్రజాస్వామ్య పాలన రావాల్సిన అవసరం ఉందని  తాను వివరించినట్టుగా కోదండరామ్ చెప్పారు. తన అభిప్రాయంతో  రాహుల్ గాంధీ కూడ ఏకీభవించారని కోదండరామ్ తెలిపారు.

తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై తమ మధ్య  చర్చ జరిగిందని రాహుల్ గాంధీ చెప్పారు.ఈ విషయమై  తన ఆలోచనలను  రాహుల్ గాంధీకి వివరించినట్టుగా కోదండరామ్ తెలిపారు.  రాహుల్ గాంధీ కూడ తన అభిప్రాయాలను  పంచుకున్నారని కోదండరామ్ చెప్పారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని రాహుల్ సూచించారన్నారు.ఈ విషయమై రేపు  
ప్రకటన చేస్తామని కోదండరామ్ ప్రకటించారు.

Rahul Gandhi  Asks My Party Support Says  TJS Chief  Kodandaram lns

also read:రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: సీట్ల సర్ధుబాటుపై చర్చ

 తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు.. తెలంగాణలో ఏం జరుగుతుందనే విషయాలను తాను  రాహుల్ గాంధీకి వివరించినట్టుగా  కోదండరామ్ తెలిపారు.వ్యక్తులతో పాటు పాలన మారాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.ఈ ఎన్నికల్లో తమ పార్టీ  మద్దతు తమకు ఉపయోగమని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. బీఆర్ఎస్ పై సమిష్టి పోరాటం చేస్తామని కోదండరామ్  తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీతో చర్చలకు కొనసాగింపుగా  రేపు హైద్రాబాద్ లో సమావేశం ఉంటుందని  కోదండరామ్ చెప్పారు.ఈ సమావేశం తర్వాత  తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కోదండరామ్ తెలిపారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios