Asianet News TeluguAsianet News Telugu

మీ సమస్యలు తీరుస్తా అని చెప్పి..రూ.13లక్షలు కాజేసిన నకిలీ జ్యోతిషుడు

పూజల పేరిట పలు పర్యాయాలుగా అతని దగ్గర నుంచి నకిలీ జ్యోతిషుడు ఆకాశ్ శర్మ మొత్తం రూ.13లక్షలు గుంజాడు. అంత మొత్తం చెల్లించినప్పటికీ.. సమస్యలు తగ్గకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు.

RACHAKONDA CYBER CRIME POLICE ARREST PSEUDO ASTROLOGER
Author
Hyderabad, First Published Oct 4, 2018, 3:58 PM IST

కుటుంబ సమస్యలతో నలిగి పోతున్న ఓ వ్యక్తిని బురిడీ కొట్టించాడు ఓ నకిలీ జ్యోతిషుడు.  మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను.. కొన్ని పూజలు చేస్తే.. మీ బాధలున్నీ తీరుతాయంటూ అతనిని నమ్మబలికి.. రూ.13లక్షలు ఎగనామం పెట్టాడు. చివరకు ఆ జ్యోతిషుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రామాంతపూర్ కి చెందిన జానకీ అనే మహిళ పెద్ద కుమారుడు గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. అవేకాకుండా ఆఫీసులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలా అని అతను ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఓ వెబ్ సైట్ కనపడింది. ఆకాశ్ శర్మ పేరిట  ఓ జ్యోతిషుని వివరాలు తెలిశాయి.

వెంటనే అతని ఫోన్ నెంబర్ సహాయంతో సంప్రదించగా..సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని నమ్మబలికాడు. అందుకు ముందుగా రూ.2,200 చెల్లించాల్సిందిగా కోరాడు. అతను వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఈ సంఘటన ఈ ఏడాది ఆగస్టు నెలలో చోటుచేసుకుంది. కాగా.. అప్పటి నుంచి వివిధ రకాల పూజల పేరిట పలు పర్యాయాలుగా అతని దగ్గర నుంచి నకిలీ జ్యోతిషుడు ఆకాశ్ శర్మ మొత్తం రూ.13లక్షలు గుంజాడు. అంత మొత్తం చెల్లించినప్పటికీ.. సమస్యలు తగ్గకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు.

దీంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. నిందితుడు పంజాబ్ కి చెందిన వాడుగా గుర్తించారు. అతని వయసు కేవలం 19 కావడం గమనార్హం. ఆకాశ్ శర్మ పేరుతో పలు రకాల వెబ్ సైట్లను క్రియేట్ చేసి.. వాటి పేరుతో ఇప్పటి వరకు చాలా మందిని మోసం చేసినట్లు గుర్తించారు.

 నకిలీ వెబ్ సైట్లు ఇవే..
1) www.specialistastrology.com
2) www.astrologershiv.com 

3) www.fastlovemarriagespecialist.com 

4) www.punjabastrologer.com 

5) www.astroakash.com

6) www.rohanidna.com 

7) www.yaallahdua.com 

8) www.duaamalforlove.com 

Follow Us:
Download App:
  • android
  • ios