ముంతాజ్ అలీఖాన్ ను వెనకేసికొచ్చిన బ్యాడ్మింటన్ ప్లేయిర్ 

పీవీ సింధూ ను వాలీబాట్ ప్లేయర్ గా సంభోదిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా వ్యాపించిన విషయం తెలిసిందే. చార్మినార్ లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

దీంతో ముంతాజ్ అలీఖాన్ ను నెటిజన్లు తెలంగాణలో బీకాం లో ఫిజిక్స్ నేతగా అభివర్ణించారు. అయితే ఈ ఘటనపై పీవీ సింధూ ఈ రోజు క్లారిటీ ఇచ్చింది.

తాను వాలీ బాల్‌ ప్లేయర్‌ అని చెప్పడం ఎమ్మెల్యే గారి ఉద్దేశం కాదని ట్విటర్ వేదికగా సింధూ వివరణ ఇచ్చింది.

స్టేజీ పైనే ఉన్న తన తండ్రిని ఉద్దేశించి నేషనల్‌ వాలీబాల్‌ ప్లేయర్‌ అన్నారని, ముంతాజ్‌ అహ్మద్‌ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోకండి అని ఆమె నెటిజన్లను కోరింది.

కాగా, సింధూ తల్లిదండ్రులు జాతీయ స్థాయిలో వాలీబాల్ ప్లేయిర్ గా రాణించిన విషయం తెలిసిందే.