Asianet News TeluguAsianet News Telugu

ఇల్లు చూపిస్తానని మహిళపై గ్యాంగ్ రేప్: నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులు

హైద్రాబాద్‌లో ఇల్లు చూపస్తామని ఓ మహిళపై రఫిక్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Woman Gang Raped By Rafiq and his Friends in Hyderabad
Author
Hyderabad, First Published Nov 7, 2021, 10:51 AM IST

హైదరాబాద్:  ఓ మహిళను నమ్మించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.ఈ ఘటన Hyderabad గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది.గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలె‌నగర్ కంచెకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటుంది. ఇళ్లలో పనులు చేసుకొంటూ ఆమె జీవనం సాగిస్తోంది.  స్థానికంగా ఉండే Rafiq కు ఆమెతో పరిచయం ఏర్పడింది. 

షాహిన్‌నగర్ లో ఇల్లు ఇప్పిస్తానని ఆమెను Carలో తీసుకెళ్లారు. అక్కడే ఓ రూమ్ లో ఆమెను బంధించి ఇద్దరు స్నేహితులతో కలిసి Gang Rapeకు చేశాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద వదిలేశాడు. ఈ విషయమై ఎవరికైనా చెబితే అంతు చూస్తామని నిందితుడు బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

also read:వివాహేతర సంబంధం : భర్త వద్దన్నాడని, పక్కా ప్లాన్ తో.. పత్తిచేలోకి తీసుకెళ్లి...

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై వారం రోజులుగా తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారుత. అయితే వారం రోజుల తర్వాత ఆమె ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మహిళలపై అత్యాచారాలు, దాడులను నివారించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకొంటున్నాయి. అయినా కూడ ఈ తరహా ఘటనలు ఆగడం లేదు. మహిళలపై దాడులను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. షీ టీమ్స్ మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకొంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  దిశ చట్టాన్ని తెచ్చింది. ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను కూడా తీసుకొచ్చింది.

Telangana రాష్ట్రంలో గతంలో Dishaపై అత్యాచారం  హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించించింది.  ఈ ఘటనలో పాల్గొన్న నిందితులంతా ఎన్‌కౌంటర్ లో మరణించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.ఈ కమిషన్ విచారణ నిర్వహిస్తుంది.

గతంలో Dlehiరాజధానిలో చోటు చేసుకొన్ని నిర్భయ ఘటన తర్వాత హైద్రాబాద్ లో జరిగిన దిశ ఘటన కూడా సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని  మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

దేశంలోని పలు రాష్ట్రాలు పలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కూడా  మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే చట్టాలు చేయడమే కాదు ఆ చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే మహిళలపై అత్యాచారాలకు పాల్పడాలంటే నిందితులు భయపడతారని మహిళా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios