దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినూత్న రీతిలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుళ్లలో పూజలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పాటలు, డాక్యుమెంటరీలు ఇలా తమ ప్రియతమ నేత పుట్టినరోజు నాడు వెయ్యి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
కేసీఆర్ 67వ బర్త్ డే : సూది రంధ్రంలో సీఎం విగ్రహం.. వెయ్యి కార్యక్రమాలతో రికార్డ్...
Pujas to documentaries : 1,000 events for KCR s birthday today - bsb
KCR, Haritha Haram programme, tree plantation, birthday celebrations, gold saree, telangana, needle eye
దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినూత్న రీతిలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుళ్లలో పూజలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పాటలు, డాక్యుమెంటరీలు ఇలా తమ ప్రియతమ నేత పుట్టినరోజు నాడు వెయ్యి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగానే వరంగల్, మట్టెవాడకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. సూది రంధ్రంలో సీఎం కేసీఆర్ బొమ్మను తయారు చేసి భేష్ అనిపించుకున్నాడు. మైక్రోస్కోప్ లో చూస్తే కానీ ఈ విగ్రహం కనిపించదు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుపుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా, కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు రంగురంగుల పూలు, పూలమొక్కలతో కెసిఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బల్కంపేట ఆలయంలోని ఎల్లమ్మ తల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను బహూకరించారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగ హరిత విప్లవంలో మరో అపూర్వ ఘట్టానికి నాంది పలకనున్నారు. కోటి వృక్షార్చన పేరుతో గంట సమయంలో రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. ఉద్యమ స్పూర్తితో సాగనున్న ఈ బృహత్ కార్యక్రమంలో సినీతారలు, సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ పాలుపంచుకోనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో ఇందులో భాగం కానున్నారు.
దీంతోపాటు అమీర్ పేటలోని గురుద్వారాలో గురుగ్రంథ్ సాహెబ్ కు ప్రత్యేక పూజలు, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి అమ్మవారికి సమర్ఫణ. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కోటి కుంకుమార్చన, సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో గణపతి కల్యాణం, విశేష అభిషేకాలు, క్లాక్ టవర్ దగ్గరున్న వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, నాంపల్లిలోని హజ్రత్ యుసిఫెన్ దర్గాలో చాదర్ సమర్పణ, జలవిహార్ లో 10.30 గంటలకు జన్మదిన వేడుకలు ప్రారంభం. 10.30 గంటలకు త్రీడీ డాక్యుమెంటరీ.. 11.00 గంటలకు కేక్ కటింగ్ జరగనున్నాయి.
