మహిళల శరీర భాగాలను ఫొటోలు తీసి, ధర నిర్ణయించి.. వ్యభిచారంలోకి.. పాతబస్తీలో వెలుగులోకి దారుణం..
హైదరాబాద్ లో పేదరికం వంకతో మహిళల్ని వ్యభిచారంలోకి దింపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఇతను బీదర్ లోని గృహాలకు వారిని అమ్ముతున్నాడు.

హైదరాబాద్ : హైదరాబాదులోని పాతబస్తీలో ఒక సోషల్ యాక్టివిస్ట్ కారణంగా అమానుషమైన ఘటన వెలుగు చూసింది. పేదరికం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను టార్గెట్ గా చేసుకుని ఓ ముఠా చేస్తున్న దారుణమైన నేరాలు బయటపడ్డాయి.. ఆర్థిక ఇబ్బందులతో పేదరికంతో మగ్గిపోతున్న మహిళలు యువత లక్ష్యంగా చేసుకుని ఓ వ్యభిచార ముఠా ఘోరాలు చేస్తోంది. ఇలాంటి కొంత మంది మహిళలను ఎంపిక చేసి వారిని టార్గెట్ చేసి, బలవంతంగా వ్యభిచారంలోకి దిగుతున్నారు. మొదట ఆ మహిళల నగ్న చిత్రాలను, వీడియోలు తీస్తారు. ఆ తర్వాత వాటిని మీడియేటర్లకు చూపిస్తారు. ఆ దళారులు ఆ మహిళలు యువతుల శరీరాలకు ధర నిర్ణయిస్తారు.
గత కొంతకాలంగా ఈ దారుణం యదేచ్ఛగా జరుగుతోంది. ఇది గమనించిన ఒక సోషల్ ఆక్టివిస్ట్.. ధైర్యంగా చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో వ్యభిచార ముఠా ఆగడాలకుఆగడాలను అడ్డుకున్నారు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కర్ణాటక, బీదర్ జిల్లాలోని రాజేశ్వర్ గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్ (35) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతను కల్బుర్గి లో వ్యభిచార గృహాలను నడిపే గులాం అనేవ్యక్తికి ప్రధాన అనుచరుడిగా పనిచేస్తున్నాడు.
బావిలో చెత్త పని చెప్పిన వార్డెన్... ఈత రాక , కరీంనగర్ జిల్లాలో విషాదం
వీరిద్దరూ కలిసి మహిళలను ఉచ్చులోకి దింపుతున్నారు . దీని కోసం గులాం ఆదేశాల మేరకు హుస్సేన్ వారం రోజుల క్రితం పాతబస్తీకి వచ్చాడు. అతని బంధువు మరదలు వరుస అయ్యే… మహిళ అ బార్కాస్ సలాలాలో ఉంటుంది. ఆమె దగ్గరికి వచ్చాడు.. ఇక్కడే ఏదైనా పని కోసం వెతుక్కుంటున్నానని చెప్పాడు. తనకు అద్దె ఇల్లు చూపించాలని అడిగాడు. తన బంధువే కావడంతో తన ఇంట్లోనే ఓ గదిని అద్దెకు చూపించింది ఆమె. ఆ తర్వాత సయ్యద్ రంగంలోకి దిగాడు. నిత్యం పాతబస్తీలో తిరుగుతుండేవాడు. ఉద్యోగం కోసం వెతుకుతుండగా నటించేవాడు.
ఫలక్ నుమాలోని మట్టి పల్లికి చెందిన ఓ మహిళ తో పరిచయం ఏర్పాటు చేసుకుని, వ్యభిచార కార్యకలాపాల కోసం మహిళల్ని వెతికే పనిలో పడ్డాడు. తన పనికి అనువుగా ఉండే యువతుల కోసం వాళ్ళిద్దరూ కలిసి గాలించే వారు. కష్టాలు తొలగించే ఉపాయం అని చెబుతూ మహిళలకు గాలం వేసేవాడు. అలా నమ్మిన వారిని తన గదికి తీసుకువచ్చేవాడు. ఆ తర్వాత సెల్ఫోన్ సహాయంతో వారి మొహం, పాదాలు కనిపించకుండా.. శరీరంలోని మిగతా భాగాలని ఫోటోలు తీసేవాడు. వీడియో చిత్రీకరించేవాడు. వాటిని తన బాసైన కల్బుర్గిలోని గులాంకు పంపించేవాడు.
అతను ఆ మహిళల ఫోటోలను, వీడియో లను పరిశీలించి వారికి ధర నిర్ణయించే వాడు. అలా వారం రోజుల్లోనే పదిమందికి పైగా మహిళలు యువతుల వివరాలను గులాం కు చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన మహిళలు కూడా ఇద్దరు ఉన్నట్లు సమాచారం. అయితే హుస్సేన్ చేస్తున్న ఈ పనులు ఓ వ్యక్తి గమనించాడు. అతను సామాజిక కార్యకర్త. ఈ ముఠా ఆట కట్టించాలని ఓ ప్లాన్ వేశారు. మరో మహిళతో కలిసి అతని దగ్గరికి వెళ్లారు. అయితే అతడు ఆమెను పొట్టిగా ఉన్నావంటూ తిరస్కరించాడు. తనతో పాటు వెళ్లిన మరో మహిళను సోమవారం నాడు మంచిగా తయారై వస్తే వీడియోలు, ఫోటోలు తీస్తానని, రేట్ చెబుతానని చెప్పాడు.
ఈమేరకు చాంద్రాయణగుట్ట పోలీసులను సమాచారం అందించారు. విషయం తెలియగానే బార్కాస్ చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హుస్సేన్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడి సెల్ఫోన్లో అనేక మంది మహిళల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. బీదర్ కేంద్రంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలకు నుంచి పెద్ద ఎత్తున యువతులను, బాలికలు, మహిళలను కొని, పంపిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.