అమీర్ పేటలో గత కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు. లోకంటో వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రంపై ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసులు దాడి చేశారు. 

అందమైన యువతుల ఫోటోలను పెట్టి.. వాటి ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. కాగా... దాడులు నిర్వహించిన పలీసులు నిర్వాహకుడు, ముగ్గురు యువతులు, ముగ్గురు విటులను అరెస్టు చేశారు. మరో నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. 

Also Read ముగిసిన కేసీఆర్, జగన్‌ల భేటీ: అమరావతి, దేశ రాజకీయాలపై చర్చ...

ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టి, చరణ్‌ అనే వ్యక్తులు లోకంటో వెబ్‌సైట్‌ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. బీకేగూడలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువతులను, చిట్టీ, విటులు ఎస్‌. సాయికుమార్‌, జె. కార్తీక్‌, ఎం. విగ్నే్‌షను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు చరణ్‌ పరారీలో ఉన్నాడు.