జగిత్యాల: చెరువుల వద్ద నిర్మించుకున్న ఇళ్ల పట్టాలు చెల్లవంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇకపై చెరువుల పక్కను ఇళ్లను నిర్మించుకోవాలని ఆలోచన వున్నవారు దాన్ని విరమించుకోవాలని సూచించారు. చెరువలను పూడ్చి వాటిపై భవనాలు కట్టడం వల్లే ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్ నీటమునిగిందన్నారు. అలాంటి పరిస్థితి రావద్దనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. 

అయితే బఫర్ జోన్‌లో ప్లాట్లు కొన్నవారికి ఇబ్బందుల్లేవన్నారు. వారు ఇళ్లు నిర్మించుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు వుండవన్నారు. అలాగని  చెరువులను కబ్జా చేయాలని చూడొద్దని సూచించారు. అలా చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదని ఎమ్మెల్యే హెచ్చరించారు. 

read more   దుబ్బాకలో టీఆర్ఎస్ కు షాక్: దామోదరతో శ్రీనివాస రెడ్డి రహస్య మంతనాలు

ఇదిలా వుంటే తమ ప్రభుత్వం ప్రైవేటు భూములను లాక్కుంటుందని అన్నానంటూ తనపై వివిధ మాద్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి ఈ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో తాను మాట్లాడినట్లుగా కొన్ని తప్పుడువార్తలు ప్రచారం జరుగుతున్నాయని... వాటిని ప్రజలెవ్వరూ నమ్మవద్దని సూచించారు. 

''నేను అసలు ప్రైవేట్ భూముల ప్రస్తావన తెలేదు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టడాలు చేసిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చామన్నాను. పేదలకు మేలు మాత్రమే చేస్తామని మాత్రమే అన్నాను'' అని మంత్రి వివరించారు. 

 ''దసరా వరకు ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఇందుకోసం వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చే పంపించాం. ఎవ్వరూ నెగిటివ్ ఆలోచనలు చేయొద్దన్నారు. ఆస్తుల సర్వేకు ప్రజలు సహకరించాలి'' అని మంత్రి గంగుల కోరారు.