Asianet News TeluguAsianet News Telugu

ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు: ఈ నెల 29న ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలపై విజిలెన్స్ ఎన్‌పొర్స్‌మెంట్ అధికారులు  నివేదికను సిద్దం చేస్తున్నారు. శనివారం నాడు ఈ నివేదికను  ప్రభుత్వానికి సమర్పించనుంది.

Probe report pins down Etala Rajendar's kin, report to be submitted on Saturday lns
Author
Hyderabad, First Published May 28, 2021, 12:00 PM IST

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలపై విజిలెన్స్ ఎన్‌పొర్స్‌మెంట్ అధికారులు  నివేదికను సిద్దం చేస్తున్నారు. శనివారం నాడు ఈ నివేదికను  ప్రభుత్వానికి సమర్పించనుంది.మాసాయిపేట, దేవరయంజాల్ లో అసైన్డ్, దేవాదాయశాఖ భూములను ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు, ఆయన అనుచరులు ఆక్రమించుకొన్నారని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల మేరకు కేసీఆర్ సర్కార్ విజిలెన్స్ , ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. 

also read:బీజేపీలోకి ఈటల రాజేందర్: ముహుర్తం ఇదే..

ఈ విషయమై అధికారులు విచారణను పూర్తి చేశారని సమాచారం. శనివారం నాడు ప్రభుత్వానికి ఈ నివేదికను సమర్పించనున్నారు. ఈ రిపోర్టుకు ఆధారంగా ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొంటుందనే విషయమై సర్వత్రా  ఉత్కంఠ నెలకొంది.  అసైన్డ్ భూముల విషయంలో పలు అవకతవకలు చోటు చేసుకొన్నాయని అధికారుల నివేదిక  తేల్చిందని సమాచారం.  మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో  విజిలెన్స్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు పర్యటించారు., ఏసీబీ అధికారులతో పాటు ఐఎఎస్ అధికారుల కమిటీ కూడ విచారణ నిర్వహించింది. ఈటల రాజేందర్ కుటుంబసభ్యులకు చెందిన జమునా హేచరీస్ సంస్థ తమ భూములను ఆక్రమించుకొందని కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మాసాయిపేటలోని 75 మంది రైతులకు రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.  

తమ నుండి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరులు తమ నుండి బలవంతంగా భూములను తీసుకొన్నారని కొందరు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రైతుల స్టేట్‌మెంట్స్ ను అధికారుల కమిటీ రికార్డు చేసింది. దేవరయంజాల్ భూముల విచారణ కోసం తార్నాకలోని  తెలంగాణ ఆర్చీవ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎవరి నుండి ఈ భూముల యాజమాన్యం మారిందనే విషయాన్ని అధికారులు పరిశీలించారు. దేవరయంజాల్ దేవాలయ భూముల్లో 160 నిర్మాణలు అక్రమంగా చేపట్టినట్టుగా అధికారుల విచారణలో తేలింది. వీటిలో ఎక్కువగా ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు ఆయన బినామీల యాజమాన్యంలో ఉన్నవేనని తేలింది. ఈ భూముల్లోని 735 సర్వే నెంబర్ లో ఏడు గోడౌన్లను ఈటల రాజేందర్ భార్య జమునా పేరిట నిర్మించినట్టుగా అధికారులు గుర్తించారు. మరో వైపు 57 సర్వే నెంబర్ లో 12 ఎకరాల్లో 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గోడౌన్లు కూడ ఈటల రాజేందర్ బినామీలు నిరమించారనే ఆరోపణలు కూడ ఉన్నాయి.ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలపై ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios