బీజేపీలోకి ఈటల రాజేందర్: ముహుర్తం ఇదే..
ఈ నెల 31వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకొన్నారు. బీజేపీ నేతలతో వరుసగా భేటీ అవుతున్న ఈటల రాజేందర్ కమలం గూటిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
హైదరాబాద్: ఈ నెల 31వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకొన్నారు. బీజేపీ నేతలతో వరుసగా భేటీ అవుతున్న ఈటల రాజేందర్ కమలం గూటిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.భూకబ్జా ఆరోపణలు రావడంతో కేబినెట్ నుండి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుండి కేసీఆర్ తప్పించారు. దీంతో పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ఈటల రాజేందర్ ను కలిశారు. మూడు రోజులుగా ఆయన బీజేపీ నేతలతో చర్చలు జరిపారు బీజేపీ నేతలు ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు సానుకూలంగా ఉన్నారు.
also read:ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలనం
బీజేపీ జాతీయ నాయకత్వం కూడ ఈటల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కమలదళం చెబుతుంది.రెండు రోజులుగా ఈటల రాజేందర్ తన అనుచరులతో ఈ విషయమై చర్చించారు. గురువారం నాడు ఉదయం టీజేఎస్ చీఫ్ కోదండరామ్, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడ ఈటల రాజేందర్ తో చర్చించారు. గురువారంనాడు బీజేపీ కేంద్ర నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ పార్టీలో చేరే విషయమై చర్చించారు. పార్టీ కేంద్ర నాయకత్వం కూడ ఈ విషయమై సానుకూలంగా స్పందించింది. ఇదే సమాచారాన్ని బీజేపీ నాయకత్వం ఈటల రాజేందర్ కు అందించింది.
ఈ నెల 31వ తేదీన సాధ్యం కాకపోతే జూన్ 1వ తేదీ లేదా రెండో తేదీలలో ఏదో ఒకరోజున ఈటల రాజేందర్ బీజేపీలో చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే బీజేపీలో చేరడానికి ముందే ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని బావించినా బీజేపీ మాత్రం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన కమలం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపినట్టుగా ఆయన సన్నిహితుల్లో ప్రచారంలో ఉంది. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై పార్టీ నేతలు తనతో చర్చించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.