ప్రియాంక గాంధీతో తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీపీసీసీ భావిస్తోంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సభ మంచిర్యాల జిల్లాలో నిర్వహించాలని, లక్ష మందిని సమీకరించాలని యోచిస్తోంది. 

టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ, లోక్ సభ సభ్యత్వానికి రాహుల్ గాంధీ అనర్హత పొందడం వంటి రెండు ప్రధాన అంశాలపైనే దృష్టి పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కొంత కాలం విరామం తరువాత మళ్లీ బీఆర్ఎస్ పై పోరుకు సిద్ధమవుతోంది. దీనిని మంచిర్యాలలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అధ్యక్షతన నిర్వహించే బహిరంగ సభతోనే మొదలు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.. మే 10న పోలింగ్, 13న ఫలితాలు.. పూర్తి వివరాలు ఇవే..

హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చి ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనపై ఏఐసీసీ నుంచి కన్ఫర్మేషన్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రియాంక గాంధీ పర్యటనలో టీపీసీసీ తలపెట్టిన పలు కీలక అంశాలు, కార్యక్రమాలపై చర్చించి ఆమోదం పొందాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఆమె ఎక్కువ ఆసక్తి కనబరుస్తారని గతంలో వార్తలు వచ్చాయి.

ఆమె పాల్గొనే ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బహిరంగ సభలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొంటారని సమాచారం. రాహుల్ గాంధీ అనర్హత వేటు, ఇళ్ల తొలగింపు నోటీసు ఎపిసోడ్ తర్వాత ఆమె నిర్వహించే తొలి బహిరంగ సభ కావడంతో ఆమె కేవలం బీజేపీ, కేంద్రంపై మాత్రమే దాడి చేయడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తారని తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ అనర్హతపై సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇద్దరూ ఆయనకు మద్దతుగా నిలబ్డడారు. ఈ నేపథ్యంలో ఆమె ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

వెజిటేరియన్ బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్... మహిళ రియాక్షన్ ఇదే..!

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నిరంకుశ బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని సమాజంలోని అన్ని వర్గాలకు బలమైన సందేశాన్ని పంపాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ బహిరంగ సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు ‘డెక్కన్ క్రానికల్’తో మాట్లాడుతూ ప్రియాంక గాంధీని బహిరంగ సభకు తీసుకురావడానికి తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, అయితే ఆమె ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

ఈ సమావేశానికి తాను హాజరవుతానని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధృవీకరించారని, మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలను సమీకరించాలని యోచిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 5 నుంచి 9వ తేదీ వరకు సభను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. 

ప్రతిపక్షాల ఐక్యతే మా లక్ష్యం, నిరసనల్లో పాల్గొంటాం: సంజయ్ రౌత్

ఈ భారీ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని పెంచుతుందని, బీజేపీని, దాని ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కోవడానికి క్యాడర్ ను ప్రేరేపిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ స్టార్ అట్రాక్షన్ గా ఉంటారని, తెలంగాణతో ఆమెకు ఉన్న ప్రత్యేక అనుబంధం రాష్ట్రంలో పార్టీకి బలం చేకూరుస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.