Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కాన్వాయ్ నంబర్‌‌ను వాడేస్తున్నారు..!

కేసీఆర్ కాన్వాయ్ నంబర్‌‌ను వాడేస్తున్నారు..!

private persons using CM Kcr convoy number

దేశంలోని వీవీఐల కాన్వాయ్‌లను పరిశీలిస్తే.. ఒకే నెంబర్ ప్లేట్‌తో పది కార్లుంటాయి.. అలా ఎందుకు ఉంటాయంటే భద్రతా కారణాల రీత్యా సదరు వీవీఐపీ ఎందులో ఉన్నాడో తెలియకుండా ఉండటానికే.. భద్రతా సిబ్బంది ఇలా చేస్తారు.  ఆ  కాన్వాయ్‌లకు వాడిన నెంబర్లను రవాణా శాఖ మరో  వ్యక్తికి కేటాయించదు. కానీ తెలంగాణలో ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లోని కార్లన్నింటికి ‘టీఎస్ 09 కె 6666’ నెంబర్ ఉంటుంది.

సంఖ్యా శాస్త్రాన్ని అమితంగా ఫాలో అయ్యే సీఎం కేసీఆర్‌ ఎంతో ముచ్చటపడి తన వాహన శ్రేణికి ఈ నెంబర్ పెట్టించుకున్నారు. అయితే ఎవరు వాడుతున్నారో ఏమో కానీ.. ముఖ్యమంత్రి నెంబర్ ప్లేట్‌ ఉన్న వాహనాలు నగరంలో చాలా చోట్ల సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వాటిలో బెంజ్, వోల్వో, వోక్స్ వ్యాగన్ వంటి లగ్జరీకార్లు ఉన్నాయి. అసలు సీఎం వాహన శ్రేణిలో రెండు టయోటా ప్రాడో, నాలుగు ఫార్చూనర్ వాహనాలు మాత్రమే ఉన్నాయి. మరి అలాంటప్పుడు అవి ఎవరివి..

కొందరు ప్రజాప్రతినిధులు, బడా బాబుల పిల్లలే ఇలా చేస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఇదంతా ఒకవైపు అయితే .. అదే నెంబర్‌తో ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో నడిపినట్లు ఆరోపణలు రావడంతో కొన్ని కార్లపై జరిమానా విధించారు అధికారులు. ఇప్పుడు ఆ చలానాలు ఎవరి వద్ద నుంచి వసూలు చేయాలా అన్నది తెలియక ట్రాఫిక్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.. విషయం పై అధికారుల వద్దకు వెళ్లడంతో దానిని సీరియస్ తీసుకున్న యంత్రాంగం... ఆ వాహనాల యజమానులను, అసలు నెంబర్లను గుర్తించి సీజ్ చేయాలని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios