ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం: రోగి బంధువుపై ప్రైవేట్ అంబులెన్స్ యజమాని దాడి
ఉస్మానియా ఆసుపత్రిలో రోగి బంధువుపై ప్రైవేట్ అంబులెన్స్ యజమాని దాడికి దిగాడు. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతుంది. ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది సహకారంతోనే ఆరిఫ్ ఖాన్ దాడులకు దిగుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.
హైదరాబాద్: Hyderabad నగరంలోని Osmania ఆసుపత్రి వద్ద ప్రైవేట్ Ambulance నిర్వాహకుడు ఓ రోగి బంధువుపై Attack దిగాడు. అడిగినంత డబ్బు ఇవ్వనందుకు గాను ఆమెపై దాడికి దిగాడు. హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన ఓ Patient ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ రోగిని డిశ్చార్జ్ చేశారు. రోగిని ఇంటికి తీసుకెళ్లేందుకు రోగి బంధువు ప్రైవేట్ అంబులెన్స్ ను సంప్రదించింది. అయితే ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుడు ఆరిఫ్ ఖాన్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై ప్రైవేట్ అంబులెన్స్ యజమాని Arif Khanతో చర్చించింది. అయినా కూడ అతను వినలేదు.
తాను చెప్పిన ధర చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పాడు. అయితే నీ అక్కా, చెల్లె ఇదే పరిస్థితిలో ఉంటే నీవు ఇదే రకంగా వ్యవహరిస్తావా అని రోగి బంధువు ప్రశ్నించింది.దీంతో ఆరిఫ్ ఖాన్ మహిళ అని చూడకుండా రోగి బంధువుపై దాడికి దిగాడు.
రోగి బంధువును దూషిస్తూ ఆమెపై దాడి చేశాడని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఆరిఫ్ ఖాన్ కు మద్దతుగా నిలిచారు. ఆరిఫ్ ఖాన్ కు కర్ర అందించారు.
ఈ తతంగాన్ని అక్కడే ఉన్న వారు వీడియో తీశారు. దీంతో ఈ వ్యవహరం వెలుగు చూసింది. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ప్రైవేట్ అంబులెన్స్ సిబ్బందితో కుమ్మక్కు కావడం వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకొంటున్నాయని బాధితురాలు ఆరోపిస్తున్నారని ఈ కథనం తెలిపింది. ఈ విషయమై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ అంబులెన్స్ మాపియా అరాచకాలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఇటీవల చోటు చేసుకొన్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా అరాచకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ప్రైవేట్ మాపియా డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేక కొడుకు డెడ్ బాడీని టూ వీలర్ పై తీసుకెళ్లాడు బాధితుడు. బాధితుడి కుటుంబానికి తెలిసిన వారు పంపిన అంబులెన్స్ ను కూడా ఆసుపత్రిలోకి రాకుండా ప్రైవేట్ మాపియా అడ్డుకుంది.ఈ విషయమై విచారణ నిర్వహించిన పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అంబులెన్స్ చార్జీల విషయమై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే.