సికింద్రాబాద్- విశాఖపట్టణం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు: ప్రారంభించిన ప్రధాని మోడీ

సికింద్రాబాద్  నుండి విశాఖపట్టణానికి  వందేభారత్  ఎక్స్ ప్రెస్  రైలును  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఇవాళ  ప్రారంభించారు.  
 

Prime minister Narendra Modi inaugurates Secunderabad-Visakhapatnam Vande Bharat express train

హైదరాబాద్; సికింద్రాబాద్ నుండి విశాఖపట్టణానికి  నడిచే  వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును  ఆదివారం నాడు ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  ప్రారంభించారు.  వర్చువల్ గా  ఈ రైలును మోడీ  ప్రారంభించారు.వర్చువల్ గా  ఈ రైలును మోడీ  ప్రారంభించారు.ఈ రైలును ప్రారంభించిన తర్వాత  ప్రదాని మోడీ  ప్రసంగించారు.   తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు  వందేభారత్ పండుగ కానుక అని ప్రధాని మోడీ చెప్పారు. ఈ రైలు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య  వేగవంతమైన  ప్రయాణానికి అవకాశం దక్కనుందని మోడీ అభిప్రాయపడ్డారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు  ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుతో ఎంతో ప్రయోజనం దక్కనుందని ఆయన  చెప్పారు. సికింద్రాబాద్-విశాఖపట్టణం  మధ్య  ఈ రైలుతో  ప్రయాణ సమయం కూడా  తగ్గనుందని మోడీ తెలిపారు. పూర్తిగా  దేశీయంగా  తయారైన  వందేభారత్  ఎక్స్ ప్రెస్  రైళ్లతో  అనేక ప్రయోజనాలున్నాయని మోడీ  చెప్పారు.

మారుతున్న  దేశ భవిష్యత్తుకు  వందేభారత్ ఒక ఉదహరణగా  మోడీ పేర్కొన్నారు. 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇదేనని  ఆయన   వివరించారు. అతి తక్కువ కాలంలోనే  ఏడు వందే భారత్ రైళ్లను ప్రారంభించినట్టుగా  ప్రధాని  తెలిపారు.ఈ రైళ్లలో  ఇప్పటికే  40 లక్షలకు పైగా ప్రయాణీకులు  ప్రయాణం చేశారన్నారు. ఇక పెద్ద గమ్యాలకు  కూడా  మనం చేరువకానున్నామని ప్రధాని మోడీ చెప్పారు.  గతంలో  రైల్వేకు  బడ్జెట్ లో  రూ. 250 కోట్లు ఇచ్చేవారని  ప్రధాని గుర్తు చేశారు.   
ప్రతి ఏటా రైల్వేశాఖకు  రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. మారుతున్న భవిష్యత్తుకు  ఇదొక నిదర్శనంగా  ఆయన పేర్కొన్నారు.

ఇవాళ మాత్రం  ప్రత్యేక  వేళల్లో మాత్రమే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.  రేపటి నుండి వందేభారత్  రైలు రెగ్యులర్ గా  సర్వీసులను నిర్వహించనుంది.విశాఖపట్టణం  నుండి సికింద్రాబాద్ కు  వందే భారత్ ఎక్స్ ప్రెస్  రైలు   ఉదయం  05:45 గంటలకు  ప్రారంభం కానుంది.  మధ్యాహ్నం  02:15 గంటలకు రైలు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.సికింద్రాబాద్  నుండి విశాఖపట్టణానికి  రైలు  మధ్యాహ్నం 3 గంటలకు  బయలుదేరి రాత్రి 11:30 గంటలకు   విశాఖపట్టణం చేరుకుంటుంది. ఈ రైలులో  14 ఏసీ కోచ్ లు ఉంటాయి. 1,128 మంది ప్రయాణీకులను  ఈ రైలు తమ గమ్యస్థానాలకు చేర్చనుంది.  ఈ రైలులో  రెండు  ఏసీ ఎగ్జిక్యూటివ్  చైర్ కారు కోచ్ లున్నాయి.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios