తెలుగు రాష్ట్రాల ప్రజలకు మోడీ శుభాకాంక్షలు

Prime minister Modi wishes to Andhra   pradesh,Telanana people
Highlights

మోడీ గ్రీటింగ్స్

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి నాలుగేళ్ళు పూర్తైన
సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ, తెలంగాణ
ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

2014 జూన్ 2న, ఉమ్మడి ఏపీ రాష్ట్రం తెలంగాణ, ఏపీ
రాష్ట్రంగా విడిపోయింది. ఇవాళ్టికి సరిగ్గా నాలుగేళ్ళు
పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రెండు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మోడీ శుభాకాంక్షలను ట్విట్టర్
వేదికగా తెలిపారు.


 "ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు. రాష్ట్ర
ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని
భగవంతుడిని ప్రార్థిస్తున్నా.  అంటూ ఆయన ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర
ప్రజలకు శుభాకాంక్షలు. రానున్న కాలంలో తెలంగాణ ప్రజల
కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్
చేశారు.


 

loader