Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు గాయం.. త్వరగా కోలుకోవాలన్న ప్రధాని మోడీ..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. 

Prime Minister Modi expressed regret over KCR's injury - bsb
Author
First Published Dec 8, 2023, 10:42 AM IST

హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గాయం ఖావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ గాయం బారిన పడడం విచారం అని.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటూ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు హైదరాబాద్‌లోని తన ఫాంహౌజ్ లో పడిపోయారు. బాత్రూంలో కాలుజారి పడ్డారు. ఆయనకు పంచె తగులుకుని పడ్డట్టుగా సమాచారం. దీంతో  కేసీఆర్ ఎడమకాలికి గాయం అయ్యింది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించారు. కాలికి ఫ్రాక్చర్ అయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలియగానే వెంటనే కేటీఆర్, కవితలతో సహా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్టుగా చెబుతున్నారు. రాత్రి ఆస్పత్రికి రాగానే అవసరమైన పరీక్షలు నిర్వహించారు వైద్యులు. శుక్రవారం ఉదయం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తరువాత కేసీఆర్ కు శుక్రవారం సాయంత్రం హిప్ రీప్లేస్ మెంట్ శస్త్రచికిత్స చేయనున్నారు. 

బాత్రూంలో కాలు జారిపడ్డ మాజీ సీఎం కేసీఆర్..

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి తన ఇంటి వద్ద ప్రజలను కలుస్తున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)అధ్యక్షుడు కేసీఆర్ 2014 నుండి 2023 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఈ ఎన్నికల్లో తెలంగాణలోని రెండు స్థానాల్లో పోటీ చేశారు కేసీఆర్. గజ్వేల్‌లో గెలిచారు. కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారు. కామారెడ్డిలో బీజేపీకి చెందిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ స్థానం నుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు పోటీ చేయగా.. వీరిద్దరినీ ఓడించి స్థానికుడైన  కాటిపల్లి వెంకట రమణారెడ్డి గెలిచారు. 

తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకోగా, బీఆర్‌ఎస్‌కు 39 మాత్రమే వచ్చాయి. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్‌ఎస్‌కు ఇదే తొలి ఓటమి.

విస్తృతమైన ఎన్నికల ప్రచారంలో, పార్టీ పేదల కోసం తన సంక్షేమ పథకాలన్నింటినీ హైలైట్ చేయడానికి ప్రయత్నించింది. అయితే, కొన్ని పథకాల అమలు వల్ల నిధుల పంపిణీపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు అపరిమితమైన అధికారాన్ని కల్పించారు, ఇది వివక్షతో పాటు అవినీతి ఆరోపణలకు దారితీసింది.

ఈ ఎమ్మెల్యేలను బకప్ చేసి తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కేసీఆర్ హెచ్చరించినప్పటికీ వారందరికీ ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా మారింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios