Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి చేసేందుకు వచ్చి.. పుస్తెలతాడు కొట్టేసిన పురోహితుడు..

పెళ్లి చేసేందుకు వచ్చిన పురోహితుడు అమ్మాయి మెడలో కట్టాల్సిన పుస్తెలతాడును కొట్టేసిన విచిత్ర సంఘటన తూఫ్రాన్ లో జరిగింది. వందేళ్లపాటు కలిసి కాపురం చేయాలని ఆకాంక్షిస్తూ.. వధూవరులతో ఏడడుగులు వేయించాల్సిన పురోహితుడే.. తాళిని దొంగిలించిన కనిపించకుండా మాయమయ్యాడు. 

priest stolen mangalsutra at a marriage in toopran - bsb
Author
Hyderabad, First Published May 19, 2021, 10:09 AM IST

పెళ్లి చేసేందుకు వచ్చిన పురోహితుడు అమ్మాయి మెడలో కట్టాల్సిన పుస్తెలతాడును కొట్టేసిన విచిత్ర సంఘటన తూఫ్రాన్ లో జరిగింది. వందేళ్లపాటు కలిసి కాపురం చేయాలని ఆకాంక్షిస్తూ.. వధూవరులతో ఏడడుగులు వేయించాల్సిన పురోహితుడే.. తాళిని దొంగిలించిన కనిపించకుండా మాయమయ్యాడు. 

మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా 
తుఫ్రాన్ పట్టణంలో దీనిమీద బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తూప్రాన్ పురపాలక పరిధిలో పడాల పల్లికి చెందిన మునిరాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేందర్ దాస్ కు.. నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతతో ఈ నెల 16న పడాలపల్లిలో వివాహం చేయడానికి నిశ్చయించారు.

వివాహం చేసేందుకు గజ్వేల్ కు చెందిన పురోహితుడిని మాట్లాడకున్నారు. మండపంలో వధూవరులు, బంధువుల దృష్టిని మరల్చి పురోహితుడు మూడు తులాల బంగారం పుస్తెలతాడును అపహరించాడు. ఆ తరువాత ఏదో పని ఉన్నట్లుగా వివాహ మండపంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయకుండానే హడావుడిగా వెళ్ళిపోయాడు.

ఆయన వెళ్లిన తర్వాత వధూవరులు బంగారం పుస్తెలతాడు లేకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. అదే రోజు పురోహితుడికి ఫోన్ చేసి ఆరా తీసేందుకు ప్రయత్నించగా, అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.

గజ్వేల్ లోని అతని ఇంటికి వెళ్లగా ఆయన తల్లి పొంతన లేని సమాధానమిచ్చింది. దీంతో వారు మంగళవారం 11వ వార్డు కు చెందిన తెరాస నాయకుడు వెంకట్ గౌడ్ ను కలిసి తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. పెళ్లి చేసేందుకు వచ్చిన పురోహితుడు పూస్తెల తాడును అపహరించాడనే సమాచారం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios