వరంగల్ జిల్లాలో నలుగురు యువకులు పూజారిపై దాడి చేయడంతో అతను మరణించాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని పోచం మైదానం వద్ద వున్న శివసాయి బాబా ఆలయంలో గత శనివారం పూజారి దేవల సత్యనారాయణ అనే వృద్ధ పూజారి పూజలు చేస్తున్నారు. 

అయితే ఈ సమయంలో ఒక వర్గానికి చెందిన నలుగురు యువకులు ఆలయంలోకి వచ్చారు. వస్తూనే తమ ప్రార్థనకు ఆటంకం కలిగించేలా మైక్ ఎందుకు పెడుతున్నావంటూ వాగ్వివాదానికి దిగి.. అనంతరం సత్యనారాయణను చితకబాదారు. 

వారి దెబ్బలకు ఆయన తీవ్రంగా గాయపడటంతో భక్తులు ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం బుధవారం నిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ సత్యనారాయణ కన్నుమూశారు. పూజారి మరణించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు.