తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు: ఏపీకి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. టీఎస్‌కు సతీశ్ చంద్ర

తెలంగాణ హైకోర్టు (telangana high court) చీఫ్ జస్టిస్‌గా సతీశ్ చంద్రశర్మ (justice satish chandra sharma) నియమితులవ్వగా.. ఏపీ హైకోర్టు (ap high court) చీఫ్ జస్టిస్‌గా ప్రశాంత్ కుమార్ మిశ్రా (justice prashant kumar mishra) నియమితులయ్యారు.

president ram nath kovind appointed new cjs for telugu state high courts

రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ హైకోర్టు (telangana high court) చీఫ్ జస్టిస్‌గా సతీశ్ చంద్రశర్మ (justice satish chandra sharma) నియమితులవ్వగా.. ఏపీ హైకోర్టు (ap high court) చీఫ్ జస్టిస్‌గా ప్రశాంత్ కుమార్ మిశ్రా (justice prashant kumar mishra) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి (president of india) రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కాగా, ఎనిమిది హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం (supreme court collegium)సెప్టెంబర్ 21న కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ సతీశ్‌‌చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ (justice nv ramana) సారథ్యంలోని కొలీజియం సిఫారసు చేసింది. సెప్టెంబర్ 16న సమావేశమైన కొలీజియం ఈ మేరకు సిఫారసులు చేసినట్టు తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం వెబ్‌పేజ్‌లో పేర్కొంది.

Also Read: తెలంగాణ హైకోర్టు సీజేగా సతీశ్‌చంద్ర.. 8 హైకోర్టుల కొత్త సీజేలకు సుప్రీం కొలీజియం సిఫారసులు

మొత్తం 8 హైకోర్టులకు నూతన సీజేల పదోన్నతితోపాటు, ఐదు హైకోర్టుల సీజేలు, 17 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫారసులు చేసింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ కర్ణాటక హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు జస్టిస్ రంజిత్ వీ మోరెను మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్‌ను గుజరాత్ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేసింది.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఛత్తీస్‌గడ్‌కు, మధ్యప్రదేశ్ జస్టిస్ మొహమ్మద్ రఫీఖ్ మధ్యప్రదేశ్‌కు, త్రిపుర హైకోర్టు జస్టిస్ అకిల్ ఖురేశీ రాజస్తాన్‌ హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజీత్ మహంతిని త్రిపురకు, మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ సోమద్దర్‌ను సిక్కిం హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని సిఫారసు చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios