Asianet News TeluguAsianet News Telugu

దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారిత అవసరం: భద్రాచలంలో రాష్ట్రపతి ముర్ము

భద్రాచలంలో  ఏకలవ్య  ఆదర్శ స్కూల్ ను  రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ఇవాళ  ప్రారంభించారు. వర్చువల్ పద్దతిలో రాష్ట్రపతి ఈ స్కూల్ ను ప్రారంభించారు.

President Draupadi murmu inaugurates ekalavya model school in bhadrachalam
Author
First Published Dec 28, 2022, 12:52 PM IST

భద్రాచలం:దేశ సమగ్ర వికాసానికి మహిళలకు సాధికారిత అవసరమని రాష్ట్రపతి  ద్రౌపది  ముర్ము చెప్పారు.సమ్మక్క, సారలమ్మ  గిరిజన పూజారుల సమ్మేళనం బుధవారంనాడు  భద్రాచలంలో  నిర్వహించారు. అంతకుముందు ఏకలవ్య ఆదర్శ పాఠశాలను రాష్ట్రపతి  ముర్ము వర్చువల్ గా ప్రారంభించారు. .  ఈ సందర్భంగా  రాష్ట్రపతి  ముర్ము ప్రసంగించారు.  ఇవాళ ఉదయాన్నే రాష్ట్రపతి భద్రాచలానికి చేరుకున్నారు.  భద్రాచలానికి చేరుకున్న వెంటనే ఆమె  భద్రాద్రి సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. 

నా తెలంగాణ కోటి రతనాల వీణ  అన్న దాశరథి వ్యాఖ్యలను రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  తన ప్రసంగంలో  ప్రస్తావించారు.గిరిజనుల అభివృద్ధికి  వనవాసి కళ్యాణ పరిషత్  ఎంతో కృషి చేస్తుందన్నారు.    భద్రాద్రి రాముడిని దర్శించుకోవడం  ఆధ్యాత్మిక అనుభూమతిని  కలిగించిందన్నారు. తెలంగాణలో తన తొలిసారి పర్యటన మంచి అనుభూతిని మిగిల్చిందని రాష్ట్రపతి  చెప్పారు. తెలుగు నేర్చుకొనేందుకు తనకు  కొంత సమయం పడుతుందని  రాష్ట్రపతి తెలిపారు. 

అంతకుముందు  రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రసంగించారు.రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముతో కలిసి ఈ వేదికను పంచుకునే అవకాశం కల్పించిన సీఎంకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు థన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. 

రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, రవాణా, పరిపాలన వికేంద్రికరణ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో వేగంగా దూసుకు పోతుందన్నారు.  రాష్ట్రంలోని మొత్తం 23 ఎకలవ్య గురుకుల పాఠశాలల ద్వారా ఏజేన్సీ ప్రాంతాల్లోని  గిరిజన ఆదివాసీ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ  నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి రాథోడ్  తెలిపారు.
 
రాష్ట్రంలో 183 గిరిజన గురుకులాలను 22  డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసినట్టుగా  మంత్రి వివరించారు. వీటిలొ ప్రత్యేకించి బాలికల కోసం 33 పాఠశాలలు కేటాయించామన్నారు.రాష్ట్రంలోని నర్సంపేట అశోక్ నగర్ లో సైనిక్ స్కూల్ ఎర్పాటు చేసినట్టుగా  మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్ధులకు విద్యతో పాటు సైనిక శిక్షణ ఇప్పించి సైనిక అధికారులను తయారు చేస్తున్నామన్నారు. 

ఇప్పటి వరకు సుమారు 1200 మంది గిరిజన విద్యార్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్టాత్మక  కళాశాలల్లో వైద్య, ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు పొందారని మంత్రి సత్యవతి రాథోడ్ వివరించారు.విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి గాను పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సహయాన్ని అందిస్తున్నట్టుగా  మంత్రి చెప్పారు. . 

గిరిజన విద్యతో పాటు వారి సంస్కృతి సంప్రదాయాలు ఆచారవ్యవహరాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.  “సంత్ సేవాలాల్ జయంతిని” “కుమ్రం బీమ్ జయంతి”లలను అధికారికంగా  నిర్వహిస్తున్నామన్నారు.ఆచార సంప్రదాయాల ప్రకారం “నాగోబా జాతర”, మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరలకు నిధులు కేటాయించి ఘనంగా జరుపుతున్నట్టుగా మంత్రి  రాథోడ్ తెలిపారు. మేడారం జాతర ఎర్పాట్లకు ఇప్పటి వరకు  రూ. 400 కోట్ల నిధులను  ఖర్చు చేసినట్టుగా  మంత్రి రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో శిశువుల, మహిళల ఆరోగ్య సంరక్షణకు, వారి సంక్షేమానికి, భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా  మంత్రి చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios