మూడేళ్ల చిన్నారిపై స్కూల్లో పనిచేసే ఆయాలు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో చోటుచేసుకుంది. కాగా.. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ కి చెందిన సాఫ్ట్ వేర్ దంపతులు తమ చిన్నారిని సమీపంలోని ఓ స్కూల్లో చేర్పించారు. కాగా.. ఈ నెల 10వ తేదీన చిన్నారి తన పట్ల ఆయాలు ప్రవర్తించిన తీరును తన తల్లిదండ్రులకు తెలిపింది. వారు పరిశీలించగా.. చిన్నారి జననాంగాల వద్ద గాయాలు ఉండటం గమనించారు. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఆయాలతో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ చిన్నారి తల్లి మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మాటిమాటికి మూత్రం పోస్తోందని ఆయాలు ఇంతటి దారుణానికి ఒడికట్టినట్టు తెలుస్తోంది. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌  తెలిపారు.