Asianet News TeluguAsianet News Telugu

అదనపుకట్నం వేధింపులు.. ఏడాదిన్నర బిడ్డ సహా గర్భిణి ఆత్మహత్య..

కొంతకాలంగా అదనపుకట్నం కోసం మౌనికను అత్తింటివారు వేధిస్తున్నారు. మంగళవారం రాత్రి భర్త రమేష్,  అత్త లక్ష్మి మౌనికతో గొడవ పెట్టుకున్నారు. ఈ విషయం  పుట్టింట్లో చెప్పలేక తీవ్ర మనోవేదనకు గురైన మౌనిక..  బుధవారం ఉదయం కూతుర్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. 

Pregnant woman commits suicide, with one and half-year-old baby in karimnagar
Author
Hyderabad, First Published Feb 3, 2022, 2:02 PM IST

పెద్దపల్లి : Extra dowry కోసం అత్తింటి వేధింపులు భరించలేక పసికందుతో సహా బావిలో దూకి ఓ తల్లి suicideకు పాల్పడింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ కథనం ప్రకారం… ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన చిగుర్ల రమేష్ కు జూలపల్లికి చెందిన మౌనికతో 3 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి కూతురు జున్ను (18 నెలలు) ఉంది. ప్రస్తుతం మౌనిక ఆరు నెలల Pregnant.  పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న రమేష్ కుటుంబంతో కలిసి పెద్దపల్లి లో ఉంటున్నాడు.

వివాహ సమయంలో మౌనిక పుట్టింటివారు రూ. 30 లక్షల నగదు, 20 తులాల బంగారం అప్పగించారు. అయినా..  కొంతకాలంగా అదనపుకట్నం కోసం మౌనికను అత్తింటివారు వేధిస్తున్నారు. మంగళవారం రాత్రి భర్త రమేష్,  అత్త లక్ష్మి మౌనికతో గొడవ పెట్టుకున్నారు. ఈ విషయం  పుట్టింట్లో చెప్పలేక తీవ్ర మనోవేదనకు గురైన మౌనిక..  బుధవారం ఉదయం కూతుర్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయమై రమేష్ తన తన బావమరిది( మౌనిక సోదరుడు)బండారి రమేష్ కు సమాచారం  అందించాడు. ఆయన పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వారు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా... మౌనిక బిడ్డతో కలిసి ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలోని రోడ్డు మీదుగా వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. పోలీసులు అటువైపు తనిఖీలు జరిపి చెరువు సమీపంలోని వ్యవసాయ బావిలో తల్లీ కూతుళ్ల మృతదేహాలను గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్ పరిశీలించారు.  మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త చిగుళ్ల రమేష్,  అత్త లక్ష్మి మీద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 

ఇదిలా ఉండగా, జనవరి 24న ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఇలాంటి ఘటనే జరిగింది. సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా వరకట్నం అనే దురాచారం పోవడం లేదు. నేటికీ వరకట్న వేధింపులతో ఎంతో మంది మహిళలు ఆహుతవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురంలో జరిగింది.

అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ bank employee భార్య suicide చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ... తాడిమర్రిలోని SBI శాఖలో పనిచేస్తున్నాడు. 2016లో YSR District పొద్దుటూరు కు చెందిన కొండయ్య, గంగాదేవి  దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నాడు. 

పెళ్లి సమయంలో రూ. 18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలు సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా సృజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్ధలు చెలరేగి తరచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో జనవరి 23 అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి పైన మూడో అంతస్తులో సుజన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

జనవరి 24 ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అదనపు కట్నం కోసమే వేధింపులకు గురి చేసి.. తమ కుమార్తెను హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని వెంకటకృష్ణ కుటుంబ సభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్ కు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు... మృతురాలి భర్త ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios